Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Share

Eatela Rajendar: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్నారా? టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయ‌న బీజేపీలో చేరే స‌మ‌యంలో ఈ మేర‌కు వ్యూహాత్మ‌కంగా ముంద‌డుగు వేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈనెల 14న బీజేపీలో చేర‌నున్న ఆయ‌న ఈ మేర‌కు త‌న గేమ్ మొద‌లుపెడుతున్నార‌ని తెలుస్తోంది.

Read More: Eatela Rajendar: ష‌ర్మిల పార్టీలోకి ఈట‌ల‌.. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఏముంటుంది?

ఈట‌ల స‌ర్వం సిద్ధం చేసుకున్నారా?

బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఉద్యమకారుడు ఈటల రాజేంద‌ర్ కు భారతీయ జనతాపార్టీ స్వాగతం పలుకుతోందని ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ సమాజం కోసం ఈటల పోరాటం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత‌ల‌కు తెలిపిన‌ట్లు స‌మాచారం. దీంతో పాటుగా ప‌లువురు నేత‌ల‌ను సైతం బీజేపీలో చేర్చ‌నున్న‌ట్లు ఈట‌ల హామీ ఇచ్చార‌ని స‌మాచారం.

Read More: Eatela Rajendar: ఈట‌ల చేయ‌లేనిది… చేసి చూపించిన కేసీఆర్ …

టీఆర్ఎస్ ఆశ్చ‌ర్య‌పోయేలా….

తెలంగాణ ఉద్య‌మకారుడైన ఈట‌ల రాజేంద‌ర్ త‌న ప‌దవికి రాజీనామా చేసే స‌మ‌యంలో గ‌న్ పార్క్ నివాళి అర్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా ఇటు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప‌లువురు ముఖ్య నేత‌ల‌ను ఆయ‌న త‌న వెంట ఢిల్లీకి తీసుకువెళ్లి కాషాయ పార్టీలో చేర్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా త‌న స‌త్తా ఏంటో టీఆర్ఎస్ నేత‌ల‌కు ఈట‌ల చాటి చెప్తార‌ని అంటున్నారు.

 


Share

Related posts

Telangana : బ్రేకింగ్ : కరోనా బారిన పడ్డ తెలంగాణ చీఫ్ సెక్రటరీ..!!

sekhar

 Anil ravipudi : అనిల్ రావిపూడి శర్వానంద్‌కి హిట్ ఇవ్వగలరా..?

GRK

Scary dreams : పీడ కలలు రావడానికి కారణాలు తెలుసుకోండి?

Kumar