Eatela Rajendar: బిగ్ బ్రేకింగ్ః ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన సీఎం కేసీఆర్

Share

Eatela Rajendar: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు రావ‌డం, ఈ ఆరోపణలపై కలెక్టర్ నివేదికను కూడా సమర్పించడం తెలిసిన సంగ‌తే. ఇదే స‌మ‌యంలో త‌న మంత్రివ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ను తొల‌గిస్తూ సీఎం క‌సీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేసుకున్నారు.

ఈట‌ల ఉదంతం….

ఈట‌ల రాజేంద‌ర్ భూకబ్జాల ఆరోప‌ణ‌ల‌ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు ఉన్నట్టు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. హాకింపేట, అచ్చంపేట గ్రామాల్లో భూములు కబ్జా జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 20 మంది బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. బెదిరించి భూములను బాధితుల నుంచి లాక్కున్నట్టు, అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించినట్లు, అనుమతి లేకుండా జమున హేచరీస్ లో పౌల్ట్రీ షెడ్డులను నిర్మించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

నివేదిక రాక‌ముందే మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ ఉప‌సంహ‌రించారు. అనంత‌రం ఎలాంటి పోర్ట్ పోలియో లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న్ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.


Share

Related posts

Hotel Bill : ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!!

bharani jella

బిగ్ బాస్ 4 : కంటెస్టెంట్స్ ను భారీగా ఎమోషనల్ చేసే వార్త వచ్చేసింది

arun kanna

‘ఇది రాజద్రోహం కాదా’!

Siva Prasad