NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Delhi Liquor Scam Case:  మాగుంట రాఘవరెడ్డి పది రోజుల ఈడీ కస్టడీ

Delhi Liquor Scam Case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ని ఇవేళ ఉదయం ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు అరెస్టు చేసిన రాఘవను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో రూ.100 కోట్లు చేతులు మారాయని న్యాయస్థానంలో ఈడీ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ పేరుతో డబ్బులు వసూలు చేసి కీలక వ్యక్తుల ద్వారా పంపించారని తెలిపింది. మాగుంట రాఘవ కు తయారీ, హోల్ సేల్ వ్యాపారం, రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని ఈడీ వివరించింది. వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

ED custody of magunta raghavareddy for 10 days

 

ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, అభిషేక్, సమీర్ మహేంద్రుడు, అమిత్ అరోరా, బినోయ్ అరెస్ట్ అయ్యారని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డితో రాఘవకు మంచి సంబంధాలు ఉన్నాయనీ, ముడుపులు సమీకరణలో సమీర్ మహేంద్రుడు కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవకు భాగస్వామ్యం ఉందనీ, దీని నుండి ఆయనకు వాటాలు వెళ్తొందని పేర్కొంది. మద్యం విధానంలో లబ్దిపొందేందుకు ముడుపులు ఇచ్చారనీ, ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని కోర్టుకు వివరించింది. ఈ కేసులో రాబట్టాల్సిన ఆధారాలు, వివరుల చాలా ఉన్నాయని ఈడీ అధికారులు కోర్టుకు తెలుపుతూ మాగుంట రాఘవను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.

కాగా రాఘవ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదనీ, పోలీస్ కస్టడీ కుదరదని వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీకి తీసుకునే అధికారం లేదని వాదనలు వినిపించారు. గత జడ్జిమెంట్ లను కోడ్ చేస్తూ కస్టడీ తీసుకునే అధికారం ఈడీకి ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టికి తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం గంట తర్వాత ఉత్తర్వులను జారీ చేసింది. పది రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఇచ్చింది. కస్టడీ సమయంలో ప్రతి రోజు గంట పాటు కుటుంబ సభ్యులు కలవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇంటి నుండి వచ్చే భోజనం తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం .. 9 మంది కార్మికులు తీవ్ర గాయాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!