ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంటకు ఈడీ నోటీసులు పంపింది. లిక్కర్ స్కామ్ కేసులో మాగుంటను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 18న ఈడీ విచారణకు హజరుకావాల్సి ఉండగా గైర్హజరు అయ్యారు.

తన సోదరుడి కుమారుడు అనారోగ్యం కారణంగా తాను చెన్నై లో ఉండిపోయాననీ, కావున విచారణకు హజరు కాలేకపోతున్నట్లుగా మాగుంట ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈడీ మరో సారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన కుమారుడు రాఘవరెడ్డి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాఘవ రిమాండ్ ను రిమాండ్ గడువు ముగియడంతో శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టు లో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో దర్యాప్తులో పురోగతి సాధించామనీ, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కాబట్టి రాఘవ రాండ్ ను పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు అభ్యర్ధించగా, అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఈ నెల 28వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ పొడిగించారు.
Brother Anil Kumar: బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు..! విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ..