ఏపిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఆసుపత్రుల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఆసుపత్రి డైరెక్టర్ల ఇళ్ల, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈడీ అధికారుల తనిఖీ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి చైర్మన్ అక్కినేని మణి అమెరికాలో వైద్యురాలుగా ఉన్నారు. మూడు నెలల క్రితం అగస్టు 21న విజయవాడలో ఆసుపత్రిని ప్రారంభించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులతో అక్కినేని ఆసుపత్రి వైద్యులకు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన ఈడీ అధికారులు ఈ రెండు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల సహకారంతో నగదును మళ్లించి అనేక అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తొంది.
గుజరాత్ లో ప్రధాన మంత్రి మోడీ మెగా రోడ్ షో .. 50 కిలో మీటర్లు, 16 అసెంబ్లీ సిగ్మెంట్లు
అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు