NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

ప్ర‌స్తుతం ఏపీలో ముగిసిన అతి పెద్ద ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌రంలో కూట‌మి పార్టీల ప్ర‌ధాన ల‌క్ష్యం వైసీ పీని గ‌ద్దె దించ‌డం. వైసీపీని ఓడించ‌డం.. సీఎం జ‌గ‌న్‌ను ఇంటికి పంపించ‌డం. ఈ నేప‌థ్యంలోనే ఈ ప్రాతిప‌దిక‌నే బీజేపీతో టీడీపీ, జ‌న‌సేన‌లు క‌లిసి ముందుకు సాగాయి. సీట్లు పంచుకున్నాయి. అయితే.. ఇక్క‌డ అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చినా..త‌ట్టుకుని ముందుకు సాగారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. వ‌చ్చిన స‌మ స్య.. ఓట్ల బ‌దిలీ వ్య‌వ‌హారం.

అంటే.. తాము పోటీ చేయ‌ని ప్రాంతంలో కూట‌మి పార్టీల ఓటు బ్యాంకు త‌మ‌కు ప‌డాల‌నేది సూత్రం. వైసీపీకి మాత్రం ప‌డ‌కూడ‌దు. ఈ ఫార్ములా ప్ర‌కార‌మే.. జ‌న‌సేన‌, టీడీపీలు ముందుకు సాగాయి. ఇక‌, ఓటు బ్యాంకు పెద్ద‌గా లేని బీజేపీకి ఈ ఫార్ములాతో లాభ‌మే త‌ప్ప‌.. న‌ష్టం లేదు. అయితే..ఎటొచ్చీ.. టీడీపీ, జ‌నసేనల ఓటు బ్యాంకు ప‌ర‌స్ప‌రం బ‌దిలీ అవుతుందా? అనేది ప్ర‌శ్న‌. ఇదే తాజాగా పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ విష‌యంలో ఆది నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌గా అడుగులు వేశారు. జ‌న‌సేన పోటీ చేసిన తిరుప‌తి వంటి ప్రాంతాల్లో టీడీపీ ఓటు బద‌లాయింపు కోసం.. చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. ఇక‌, భీమ‌వ‌రంలో టీడీపీ నుంచి తీసుకువ‌చ్చిన అభ్య‌ర్థి పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులుకు.. టీడీపీ ఓటు బ్యాంకు త‌గ్గ‌కుండా చూసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అదేవిధంగా అవ‌నిగ‌డ్డ నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో ఉన్న మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌కు టీడీపీ ఓట్లు ప‌డేలా వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, చంద్ర‌బాబు కూడా.. దాదాపు ఇదే ఫార్ములాను పాటించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అత్యంత కీల‌కంగా తీసుకుని ఓటు బ‌దిలీపై క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్ల‌కు దిశానిర్దేశం చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు జ‌రిగిన పోలింగ్ గ‌మ‌నిస్తే.. జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న చోట టీడీపీ ఓటు బ్యాంకు బ‌దిలీ కావ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇక్క‌డ పోలింగ్ కూడా స‌రిగా జ‌ర‌గ‌లేదు. పైగా.. మ‌హిళ‌లు ఓటేశారు త‌ప్ప‌.. టీడీపీ సానుభూతిప‌రులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌గ్గారు. ఇక‌, టీడీపీ పోటీ చేసిన చోట్ల కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌దిలీ అయినా.. 20 శాతం లోపే ఉంద‌ని అంచ‌నా. దీంతో ఓటు బ‌దిలీ మాత్రం జ‌ర‌గ‌లేద‌న్న‌ది.. విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?