NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? కూట‌మి గెలుపు ప‌క్కానా? జ‌గ‌న్ మ‌రోసారి విజ‌యం గ్యారెంటీనా? ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లుసుకున్నాజ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. ఇప్ప‌టికే 20కిపైగా స‌ర్వేలు వ‌చ్చాయి. వీటిలో 11 స‌ర్వేలు ఏక‌ప‌క్షంగా కూట‌మి గెలుపు ప‌క్కా అని తేల్చాయి. ఇదేస‌మ‌యంలో 7 స‌ర్వేలు వైసీపీకి ఎడ్జ్ ఎక్కువ‌గా ఉంద‌ని తేల్చి చెప్పాయి. వీటిలో చిన్న సంస్థ‌లు.. ఏబీపీ సీ ఓట‌ర్‌, ఆత్మ సాక్షి, న్యూస్ 18, ఆర్బిట్ వంటి జాతీయ సంస్థ‌లు కూడా ఉన్నాయి.

వీటిలో కొన్ని వైసీపీ కి మొగ్గు చూపించాయి. ఇక‌, చిన్నా చిత‌కా సంస్థ‌లు మాత్రం కూట‌మికి మొగ్గు చూపు తున్నాయి. వీటిలో కొన్ని పెయిడ్ స‌ర్వేల‌నే చ‌ర్చ కూడా ఉంది. ఎలా చూసుకున్నా. పైట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంద‌నేది అంద‌రూ ఒప్పుకొంటున్న విష‌యం. గ‌త ఎన్నిక‌ల‌కు మాదిరిగా.. ఏక‌ప‌క్షంగా అయితే.. ఉండే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఏ పార్టీ అభ్య‌ర్తి గెలిచినా.. స్వ‌ల్ప మార్జిన్‌తోనే విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు కలిసినా.. ఉద్యోగులు క‌లిసినా.. కూడా.. స‌ర్వేల పై చ‌ర్చ జోరుగా నే సాగుతోంది. అయితే.. ఇక్క‌డే కీల‌క‌మైన విష‌యం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ప్ర‌చారం ఒక ఎత్తు అయితే… ఇక‌, గురువారం నుంచి ప్రారంభం అవుతున్న నామినేష‌న్ల ప‌ర్వం త‌ర్వాత‌.. సాగే.. ప్ర‌చారం మ‌రో ఎత్తుగా ఉండ‌నుంది. ఇక‌, తాయిలాలు.. ఓట‌ర్ల‌కు డ‌బ్బులు వంటివి కూడా ప్ర‌భావం చూప‌నున్నాయి. ఇదేస‌మయంలో హేమా హేమీలు రంగంలోకిదిగుతున్నారు.

బీజేపీ నుంచి ప్ర‌ధాని మోడీ మూడు భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. అమిత్ షా నాలుగు, యూపీ సీఎం యోగి నాలుగు స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. ఇక‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా.. కూట‌మి ప‌క్షాన నాలుగు స‌భ‌ల్లో పాల్గొంటారు. దీంతోఇప్ప‌టి వ‌రకు ఉన్న స‌ర్వేలు త‌ల‌కిందులు అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. దీనికి తోడు.. పార్టీలు. మేనిఫెస్టోలు ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇవి ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. మ‌రిం త మార్పు ఉంటుంద‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. దీంతో మ‌రో 15 రోజులు ఆగితే త‌ప్ప‌.. ఏపీలోఎవ‌రు అధికారం చేప‌డ‌తార‌నేది స్ప‌ష్టంగా తెలియ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?