YCP Govt: జగన్ కు ఆ విషయంలో జై కొట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!

Share

YCP Govt: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ప్రజల నుండి మరో వైపు రాజకీయ నేతల నుండి రెండు రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ మార్చేశారన్న విమర్శ ఒక పక్క నుండి వస్తుంది. మరో పక్క ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన నాటి నుండి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కంటే సంక్షేమ పథకాల అమలుపైనే అధిక ప్రాధాన్యత చూపుతున్నారన్న పేరు ఉంది. ఎన్నికల మానిఫెస్టోలో సీపీిఎస్ రద్దు, పెన్షన్ పెంపు, 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెన్షన్ వంటివి మినహా 80 శాతం పైగా హామీలను అమలు చేశారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు.

YCP Govt: నాడు నేడు, పీ హెచ్ సీలో మెరుగవుతున్న సేవలు భేష్

ఇదే క్రమంలో సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ జగన్మోహనరెడ్డి పాలనపై తన దైన శైలిలో స్పందించారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న రెండు పథకాలకు లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు. జగన్మోహనరెడ్డి పరిపాలనలో విఫలమైయ్యారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏకీభవిస్తున్నారా అన్న ప్రశ్నకు లక్ష్మీనారాయణ సమాధానం ఇస్తూ ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో వాటిపై విడివిడిగా అనలైజ్ చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తనకు తెలుసునని పేర్కొన్న జేడీ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నేడు మౌళిక సదుపాయల కల్పనకు నాడు – నేడులో ప్రయత్నం జరుగుతోందన్నారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల మెరుగునకు కృషి జరుగుతోందన్నారు. పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా దీనికి కేటాయించారన్నారు.

YCP Govt: కుల పరంగా డబ్బులు పంపిణీ మంచిది కాదు

ఈ రెండు స్కీమ్ లను ప్రశంసించిన ఆయన మరో స్కీమ్ నిర్వహణను తప్పుబట్టారు. ఒక కులానికి చెందిన వారు ఇంత వయసు దాటిన వారికి డబ్బులు ఇచ్చే పథకం మంచిది కాదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ పథకం అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఒక కులానికి, ఓ వర్గానికో ఉపయోగపడేలా ఉండకూడదన్నారు. ఇటువంటి పథకాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పథకాల్లో మార్పు రావాలన్నారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన మేనిఫెస్టోలను పక్కన బెడుతున్న ఈ తరుణంలో జగన్మోహనరెడ్డి సర్కార్ మేనిఫెస్టోలోని అంశాలు అంటే నవరత్నాల అమలునకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.


Share

Related posts

Bag: అక్కడ ఒక బ్యాగ్ ఉందని ఫోన్ వచ్చింది!! అది తెరిచి చుసిన బాంబు స్క్వాడ్ షాక్!!

Naina

ఏడాదిలో ఏకంగా 4700 కేసులు..! బాల్యం మసకబారుతుంది..!!

Special Bureau

Gujarat: గుజరాత్ లో ముఖ్యమంత్రి మార్పునకు కారణం ఇదే..

somaraju sharma