మాజీ మంత్రి కి లోన్ యాప్ వేధింపులు..! మాస్ వార్నింగ్ ఇచ్చిన అనిల్ కుమార్!?

Share

లోన్ రికవరీ ఏజంట్ల అరాచకాలు మితిమీరుతున్నాయి. వీళ్ల వేధింపులకు కొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో లోన్ రికవరీ ఏజంట్ల వేదింపులు భరించలేక జాస్తి వర్షిణి (17) తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు సంబంధిత రికవరీ ఏజంట్ల పై కేసులు నమోదు చేశారు. రుణ యాప్ ఏజంట్ లు రుణం తీసుకున్న వారు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ లకు సైతం ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. నందిగామ ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో ఏకంగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. పీఏ శంకర్ ను ఏజెంట్లు బెదిరింపులకు గురి చేశారు. రుణం చెల్లించకపోతే పిల్లలను చంపేస్తామంటూ హెచ్చరించడం కలకలాన్ని రేపింది. ఈ క్రమంలో రికవరీ ఏజంట్ల ఆగడాలపై జిల్లా ఎస్పీకి శంకర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బ్యాంకు ఏజంట్ల నుండి తరచు ఫోన్ లు రావడంపై ఆయన సీరియస్ అయ్యారు. తాజాగా ఈ వేధింపులు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్  కు తప్పలేదు. తనకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ డబ్బులు కట్టాల్సిందేనంటూ బ్యాంకు ఏజెంట్ ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటంతో అనిల్ కుమార్ చెప్పుతో కొడతానంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బ్యాంకు మహిళా ఏజంట్, మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బ్యాంకు రికవరీ ఏజెంట్, అనిల్ కుమార్ మధ్య సంభాషణ ఇలా సాగింది

బ్యాంకు ఏజెంట్ : అనిల్ కుమార్ గారా సార్ మాట్లాడుతుంది..
అనిల్ కుమార్ : అవునమ్మా
బ్యాంకు ఏజెంట్ : పాత పాటి అశోక్ కుమార్ ఏమవుతారు సార్ మీకు
అనిల్ కుమార్ :ఆయన ఎవరమ్మా
బ్యాంకు ఏజెంట్ : మీకు తెలియదా సార్ .. ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు

అనిల్ కుమార్ : నాకు తెలియదమ్మా
బ్యాంకు ఏజెంట్ : ఇది నెల్లూరే కదండి
అనిల్ కుమార్ : అవునమ్మా .. నీకు ఏమి కావాలి
బ్యాంకు ఏజెంట్ : నేను బ్యాంకర్ నుండి కాల్ చేస్తున్నాను. ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి ఆల్టర్ నేట్ నెంబర్ గా మీరు బ్రదర్ అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చి ఉన్నారు
అనిల్ కుమార్ : దేని గురించి అడుగుతున్నారు
బ్యాంకు ఏజెంట్ : నేను బ్యాంకర్ ను ప్రియాంకను మాట్లాడుతున్నాను. పాతపాటి అనిల్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాసులు
అనిల్ కుమార్ : నాకు తెలియదు. ఎందుకు కాల్ చేస్తున్నారు
బ్యాంకు ఏజెంట్ : ఇక్కడ (ఫ్రడరన్ బ్యాంకులో) లోన్ పెండింగ్ ఉంది. బ్రదర్ ఇన్ లా అని మీ నెంబర్ మెన్షన్ చేశారు
అనిల్ కుమార్ : అతను ఎవరో నాకు తెలియదు
బ్యాంకు ఏజెంట్ : అతనే మీ నెంబర్ మెన్షన్ చేసి ఉన్నారు.
అనిల్ కుమార్ : అతన్ని ఎత్తి లోపల వేయండి
బ్యాంకు ఏజెంట్ : మీరే పే చేస్తారని అతను అంటున్నారు
అనిల్ కుమార్ : నాకు అశోక్ కుమార్ అనే వాడు అన్న తమ్ముడు ఎవరూ లేరు, ఎత్తి లోపల వేయండి అంటున్నా
బ్యాంకు ఏజెంట్ : మీ బ్రదర్ ఇన్ లా సార్
అనిల్ కుమార్ : అశోక్ కుమార్ అనే బావ మరిది కూడా లేడు
బ్యాంకు ఏజెంట్ : తనకు కాల్ చేస్తే అతనే మీ నెంబర్ మెన్షన్ చేశాడు మీ ఫాదర్ లేట్ తిరుపతయ్య
అనిల్ కుమార్ : అవునమ్మా .. అశోక్ కుమార్ అనే వాడు ఎవరు నాకు బావ మరిది కాదు
బ్యాంకు ఏజెంట్ : తనకు కాల్ చేస్తే మీరే కడతారు అని అంటున్నారు
అనిల్ కుమార్ : ఎవరు కడతారు. అతన్ని ఎత్తి లోపల వేయండి

బ్యాంకు ఏజెంట్ :మరి డబ్బులు ఎవరు కడతారు
అనిల్ కుమార్ : చెప్పుతో కొడతా, వాడెవడో నా పేరు ఇచ్చి నేను కడతానంటే ఎలా , దారిన పోయే వెదవ నా కొడుకు ఇస్తే నాకు కాల్ చేస్తారా, ఎవరితో మాట్లాడుతున్నావ్
బ్యాంకు ఏజెంట్ : రూ.8లక్షలు ఎవరు కడతారు సార్, ఇద్దరు కలిసే కదా సార్ వాడుకున్నది
అనిల్ కుమార్ : చెప్పుతో కొడతా, ఇందాకటి నుండి చెబుతుంటే నేను వాడుకున్నా నేను వాడుకున్నావంటా వేంటి, ఏమి మాట్లాడుతున్నావ్
బ్యాంకు ఏజెంట్ : మీ బావ గారిని అడగండి , అతనే కదా మీ నెంబర్ మెన్షన్ చేసింది
అనిల్ కుమార్ : ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్వావ్ సంబంధం లేదని చెబుతున్నా అదే మాట్లాడుతున్నావ్
బ్యాంకు ఏజెంట్ : సంబంధం లేకపోతే మీ నెంబర్ ఎందుకు ఇచ్చారుసార్
అనిల్ కుమార్ : మీ పేరు ఏమిటి
బ్యాంకు ఏజెంట్ : ప్రియాంక
అనిల్ కుమార్ : మీరు ఎక్కడ ఉంటారు
బ్యాంకు ఏజెంట్ : ఫ్లాట్రాన్ బ్యాంక్ సార్, నెల్లూరు బ్రాంచ్

అనిల్ కుమార్ : ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేశావు. ఇక మర్యాదగా ఉండదు, మీ మేనేజర్ నెంబర్ పెట్టు మాట్లాడతాను
బ్యాంకు ఏజెంట్ : ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో అతని నెంబర్ ఇస్తాను సార్
అనిల్ కుమార్ : నీవు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లైయింట్ ఇచ్చుకో
బ్యాంకు ఏజెంట్ : నేను మీకే కాల్ చేస్తా
అనిల్ కుమార్ : నేను నీ నెంబర్ వెబ్ సైట్ లో పెడతా ఎవరో కాల్ చేస్తే నీకేమిటి సంబంధం, ఏమి మాట్లాడుతున్నవ్ నీరు. మీ బ్యాంకు మేనేజర్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా
బ్యాంకు ఏజెెంట్ : వాళ్లతో మాట్లాడి ఏమి చేస్తారు అండీ
అనిల్ కుమార్ : నీవు ఎవరు నాకు కాల్ చేయడానికి
బ్యాంకు ఎజెంట్ : డబ్పులు ఎవరు కడతారు అండీ
అనిల్ కుమార్ : నీవు ఎవరికి డబ్బులు ఇచ్చావో వాళ్ల దగ్గర వసూలు చేసుకో
బ్యాంకు ఏజెంట్ : తనేమో మీ బావ మరిది అంటున్నారు
అనిల్ కుమార్ : నాకు బావ మరిది లేడని చెబుతుంటే అర్ధం కావడం లేదా
బ్యాంకు ఏజెంట్ : తనేమో మీ బావమరిది అంటున్నారు. మీరేమో ఎవరు లేరంటున్నారు
అనిల్ కుమార్ : మీ బ్యాంకు అడ్రస్ చెబితే మావాళ్లు వచ్చి మాట్లాడతారు
బ్యాంకు ఏజెంట్ : వచ్చి 8 లక్షలు కడతారా
అనిల్ కుమార్ : ఏమి మాట్లాడుతున్నావ్ నీవు

ఇలా అనిల్ కుమార్, బ్యాంకు మహిళా ఏజెంట్ తో సంభాషణ జరిగింది. ఈ అంశంపై అనిల్ కుమార్ జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. ఓ పక్క మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మరో పక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు బ్యాంకు ఏజెంట్ల నుండి వేధింపుల ఫోన్ కాల్స్ రావడంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు సీరియస్ గా స్పందించారు. నెల్లూరు పోలీసులు వెంటనే స్పందించి నలుగురు రికవరీ ఏజెంట్ లను అరెస్టు చేశారు. కోల్ మాన్ రికవరీ సంస్థ నుండి ఫోన్లు వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు .. పెంచలరావు, మాధురి. గురు ప్రసాద్ రెడ్డి, మహేంద్రన్ అనే నలుగురు ఏజెంట్ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి వివిధ సిమ్ కార్డులు, ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీ యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంటర్నెట్ ద్వారా ప్రముఖుల నెంబర్ లు తీసుకుని లోన్ తీర్చాలంటూ వేధింపులు పెడుతున్నట్లు గుర్తించామని ఎస్పీ విజయారావు తెలిపారు.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

2 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

53 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago