Somereddy: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుండి ఈ మందు పంపిణీపై అనుమతులు రాలేదు. కానీ వివిధ ప్రాంతాల నుండి ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం జనాలు ఆశతో వస్తూనే ఉన్నారు. మరో పక్క ఈ మందు పంపిణీపై న్యాయ పోరాటానికి దిగారు. ఆనందయ్య మందు పంపిణీని కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్ లను విచారణకు ధర్మాసనం స్వీకరించింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ బృందం మంగళవారం కృష్ణపట్నం గ్రామంలో పర్యటించింది. టీడీపీ నేతలు అక్కడ ఉన్న సమయంలోనే మరో అద్భుతం జరిగింది.

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ యువకుడు 20 రోజులుగా కరోనా సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నా అతనికి తగ్గకపోవడంతో అనంతయ్య ఆయుర్వేదం మందు గురించి తెలుసుకుని తన తల్లితో కలిసి కృష్ణపట్నం వచ్చాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా వందలాది మంది చూస్తుండగానే ఆ యువకుడు గ్రామంలోని ఓ చెట్టు వద్ద స్పృహతప్పి పడిపోయాడు. ఆనందయ్య కుటుంబ సభ్యులు ఆ యువకుడి కంటిలో చుక్కల మందు వేసిన పది నిమిషాల్లో లేచి చక్కగా మాట్లాడాడు. మా లాంటి పేద వాళ్ల కోసం ఆనందయ్య మందు పంపిణీని కొనసాగించాలని ఈ సందర్భంగా ఆ యువకుడు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
Read more: Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ ..! ఎందుకంటే..?
ఈ సందర్భంలో సోమిరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఈ యువకుడు 20 రోజులుగా అక్కడ చికిత్స పొందినా తగ్గకపోవడంతో ఇక్కడకు వచ్చాడన్నారు. ఇక్కడ మన కళ్ల ఎదుట డ్రాప్స్ వేస్తే 15 నిమిషాల్లో అతను కోలుకున్న విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఎక్కడ నుండో వచ్చిన వీళ్లు ఆనందయ్య మందును కొనసాగించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంత కంటే సాక్షం అవసరం లేదన్నారు. రేపు ఉదయం నుండి ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే ప్రజలు, దేవుడు కూడా క్షమించడని సోమిరెడ్డి అన్నారు.
Shruthi Haasan: పేరెంట్స్ పై సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!