Ex MP Chinta Mohan: మరో సారి సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్..!!

Ex MP Chinta Mohan sensational comments on jagan govt
Share

Ex MP Chinta Mohan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి 151 మందికి పైగా బలం ఉంది. మరో పక్క గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. పాలనాపరంగా జగన్మోహనరెడ్డికి తిరుగులేదు. ప్రజల్లోనూ పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ కోర్టు కేసుల చిక్కులే ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణ రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నాటి నుండి అనేక రకాల ఊహాగానాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీబీఐ కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు కానీ ఓ సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బెయిల్ రద్దు అవుతుందా. జగన్ తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమా, రాష్ట్రంలో సీఎం మారబోతున్నారా అంటూ డిబేట్లు నిర్వహించడం, దానికి తగినట్లుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడటం జరుగుతోంది. ఇక పలువురు నాయకులు అయితే జగన్ ప్రభుత్వంపై జోస్యాలు కూడా చెబుతున్నారు.

Ex MP Chinta Mohan sensational comments on jagan govt
Ex MP Chinta Mohan sensational comments on jagan govt

ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే బోగి పండుగ లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ పోతుందన్న భయంతోనే జగన్ బయటకు రావడం లేదని అన్నారు. ఏపిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ, పేదలకు ఇచ్చే బియ్యాన్ని సైతం ప్రజా ప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్ ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయించాలని తీసుకుంటున్న నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పుబట్టారు. ప్రభుత్వానికి సినిమా టికెట్లు విక్రయించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరమని అది కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. దీపావళి పండుగ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకం జరుగుతుందని చెప్పారు.

కాగా చింతా మోహన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై జోస్యం చెప్పడం ఇదే ప్రధమం కాదు. గతంలోనూ పలు సందర్భాలలో కొత్త సీఎం రాబోతున్నారంటూ ఆయన జోస్యం చెప్పారు. నెల రోజుల క్రితం కూడా తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడతూ కొద్ది వారాల్లో సీఎం మార్పు జరగబోతుందంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనూ ఇలాంటి జోస్యాన్నే చెప్పారు. చింతా జోస్యాన్ని పక్కన బెడితే జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 15వ తేదీన సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేస్తూ జోస్యాలు చెబుతున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..


Share

Related posts

Advocates Murder case : పోలీసుల అదుపులో న్యాయవాదుల హత్య కేసు నిందితులు

somaraju sharma

PM Modi: యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి…! ప్రధాని నరేంద్ర మోడీ..!!

somaraju sharma

Prabhas: బాలయ్య బాబు సినిమా ఫార్ములాతో ప్రభాస్ అతి పెద్ద భారీ బడ్జెట్ మూవీ…??

sekhar