Diamond: ఆ రైతు అదృష్టం పండింది..! ఒక్క రోజులోనే కోటీశ్వరుడైయ్యాడు..! అదేలా అంటే..?

Share

Diamond: అతను ఓ సాధారణ రైతు. తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరికి ఆ రైతు ఉన్న పళంగా రాత్రికి రాత్రి కోటేశ్వరుడు అయ్యాడు. తన పొలంలో వేసిన పంట విరగకాయలేదు. దిగుబడి అధికంగా రాలేదు కానీ ఒక్క సారిగా కోటేశ్వరుడు అయ్యాడు. అదేలా అంటే.. అదృష్ట దేవత ఆయన ఇంటి తలుపు తట్టింది. కోట్ల రూపాయల విలువైన వజ్రం ఒకటి ఆయన పొలంలో లభ్యమైంది. అదే ఆయనను కోటేశ్వరుడిని చేసింది.

Farmer got Diamond his farming land
Farmer got Diamond his farming land

 

Read More: NTR In Politics: తెలుగు రాజకీయం.. మారిన కథ ఇదే..!!

విషయంలోకి వెళితే…కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏటా తొలకరి వర్షాలు పడిన సమయంలో వ్యవసాయ భూముల్లో చిన్న, పెద్ద వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుండి జనం ఇక్కడకు వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాల కోసం అన్వేషణ కూడా చేస్తుంటారు. కాకపోతే ఈ రైతు అటువంటిది ఏమి చేయకుండానే ఆకస్మాత్తుగా తన పొలంలో రోజు మాదిరిగా పనులు చేసుకుంటుండగా మిలమిలా మెరుస్తున ఓ రాయి కనిపించింది. అతి వజ్రంగా తెలుసుకున్న అతను వెంటనే దాన్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లాడు.

తరువాత ఆ రాయిని స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారికి చూపించగా అతను రూ.1.2కోట్లు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. 30 క్యారెట్ల బరువు ఉన్న వజ్రం ధర మార్కెట్ లో రూ.2 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ విషయం ఇతర వ్యాపారులకు తెలిసి నిరుత్సాహానికి గురైయ్యారు. ఇది తమ చేతికి వచ్చి ఉంటే రూ.80లక్షల వరకూ లాభం వచ్చేది అని అనుకుంటున్నారు. ఈ వజ్రం దొరికిన విషయం గ్రామంలో పెద్ద చర్చ జరుగుతున్నా ఇటు రైతు గానీ, అటు వ్యాపారి గానీ విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు.


Share

Related posts

Girl child: గర్భం పెద్దదిగా ఉంటే గర్భంలో ఆడశిశువు ఉన్నట్టా ??

Naina

KCR : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసిఆర్

somaraju sharma

 ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..! ఏ కేసులో అంటే..?

Special Bureau