NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Chittor : చంద్రబాబు × పెద్దిరెడ్డి!

Chittor : ఆంధ్రప్రదేశ్లో కీలకమైన జిల్లా చిత్తూర్ chittor. ఇటు తమిళనాడు సరిహద్దులో అటు కర్ణాటక సరిహద్దును కలిగి ఉన్న ఈ రాష్ట్రం రాయలసీమ భౌగోళిక పరంగానూ విభిన్నంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ యాత్ర భాషతోపాటు రాజకీయాలు ప్రత్యేకమే. జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేస్తే, ఎందరో మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ఇక జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేస్తే ఆయన సమకాలికుడు గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతే కాలం మంత్రిగా పని చేశారు. చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీయాలని చాలా మంది భావిస్తారు. పెద్ద రెడ్డి మాత్రం రాజకీయంగా దెబ్బ తీయాలని పని చేస్తారు. ఎంత కసిగా చంద్రబాబు ఓటమి కోసం పెద్దిరెడ్డి వేచి చూస్తారు అనేది చిత్తూరు జిల్లా రాజకీయాలను పూర్తిగా అవపోసన పట్టిన వారికి తెలుస్తుంది.

ఇద్దరిదీ ఎడతెగని వైరం!

చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వయసు లో, రాజకీయాల్లో సమకాలికులు. చదువులోనూ దాదాపు అంతే. ఇద్దరూ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి యూనియన్లకు నాయకత్వం వహించిన వారే. 1970 వ దశకంలో విద్యార్థి యూనియన్ రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేవి. కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను మించి జరిగేవి. sv విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు ఒక వర్గానికి గ్రూపు నాయకుడిగా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో వర్గానికి నాయకుడుగా వుండేవారు. విశ్వవిద్యాలయం రాజకీయాల నుంచే చంద్రబాబు పెద్ద రెడ్డిలు ఒకరిపై ఒకరు… ఒకరి ఓటమి కోసం ఒకరు పని చేయడం మొదలు పెట్టారు. వీరిద్దరి కాలంలోనే విశ్వవిద్యాలయం రాజకీయాలు కాస్త బయటి రాజకీయ నాయకుల వరకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా విద్యార్థులు విడిపోయి, దానికి బయట ఉన్న రాజకీయ నాయకులు సైతం ఆజ్యం పోయడం తో ఇద్దరూ తీవ్ర స్థాయిలో పోరాడేవారు. ఒక్కో దఫా ఒక్కొక్కరు విశ్వవిద్యాలయం రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించినప్పటికీ, చంద్రబాబు దే పైచేయి గా ఉండేదని అప్పట్లో విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారు చెబుతారు.

దాని తర్వాత రాజకీయాల్లో…

విశ్వవిద్యాలయ పూర్తి అయిపోగానే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చిత్తూరు పశ్చిమ ప్రాంతం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్వికులు సమితి అధ్యక్షుడిగా ఉంటూ వచ్చేవారు. దీంతో పెద్దిరెడ్డి సైతం రాజకీయాల మీద ఆసక్తి ఉండటంతో పాటు కుటుంబ మంతా కాంగ్రెస్ లోనే ఉండడం తో చిత్తూరు పశ్చిమ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాలు మొదలు పెట్టింది. దాని తర్వాత చంద్రబాబు మంత్రి కావడం, టీడీపీలోకి వెళ్లడం, ఆయన పెళ్లి అన్నీ చకాచకా జరిగిపోయాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ మంత్రిగా పని చేసారు.

అధికారంలో ఉంటే వారి దే ఆధిపత్యం

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పెద్దిరెడ్డి ల రాజకీయం పైకి కనిపించదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పెద్దిరెడ్డి చేసే వ్యాపారాలకు ఆయన అనుచరుల కార్యకలాపాలపై దృష్టి పెడితే పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే అదేమాదిరి చక్రం తిప్పేవారు. చంద్రబాబు వేగవంతమైన ఎదుగుదలకు దీటుగా పెద్దిరెడ్డి రాజకీయాల్లో ఎదగ పోయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కాస్త పర్వాలేదు అన్న కోణంలో ఉంటారు. ఎక్కువ బెంగుళూరు కేంద్రంగా తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పెద్దిరెడ్డి తన అనుకునే వారికీ అండగా నిలుస్తారు. అలాగే చంద్రబాబు ఎక్కువ కాలం హైదరాబాదులో గడపడంతో జిల్లా రాజకీయాల మీద పట్టు ఉన్నప్పటికీ, సొంత జిల్లాలోని అందరినీ కలుపుకు వెళ్లడం లో మాత్రం వెనుకబడ్డారు అనేది వాస్తవం.

తాజాగా కుప్పంలో వ్యూహం

మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కోపంలో వైఎస్ఆర్సిపి గాలి గట్టిగా వీయడం. దీనికి ప్రధాన కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పాలి. 2019 కుప్పం ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. చంద్రబాబు మీద రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతి తర్వాత పెద్దిరెడ్డి అక్కడ విభిన్నమైన పంధాలో పార్టీని బలోపేతం చేశారు. మండలానికి ఒక ఇంచార్జ్ ను నియమించి, గ్రామాల్లో పట్టు పెంచుకునే వ్యూహం సిద్ధం చేశారు. మండల ఇన్చార్జి ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో తిరిగేలా, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా, జగన్ ప్రభుత్వం మీద సానుకూలత వచ్చేలా పక్కాగా స్కెచ్ వేయడంతో ప్రస్తుత ఫలితాలూ వైసిపికి అనుకూలంగా వచ్చినట్లు అర్థమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబును కుప్పం నుంచి ఓడించడం అనేది పెద్దిరెడ్డి జీవిత లక్ష్యం. విశ్వవిద్యాలయం రాజకీయాల నుంచి వచ్చిన రాజకీయ వైరాన్ని చివరి దశలో కచ్చితంగా తీర్చుకోవాలని పెద్ద రెడ్డి భావిస్తున్నారు. పరుగు మొదలు పెట్టడం గొప్పకాదు దానిని పూర్తి చేయడమే అసలైన విజయం అనేది పెద్దిరెడ్డి సూత్రం…

author avatar
Comrade CHE

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju