NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nimmagadda : నిమ్మగడ్డ × జనసేన !!

Nimmagadda : ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జనసేన పార్టీకి యుద్ధవాతావరణం కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ లేదా ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ ఎన్నికలు మళ్లీ ఎక్కడైతే ఆగాయో అక్కడినుంచే ఎన్నికలు పెడతామని చెప్పడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మునిసిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఇటీవల ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ వివాదానికి దారి తీస్తోంది. మొన్న విడుదల చేసిన నోటిఫికేషన్ కోనసాగింపు అనటంతో పలు అనుమానాలు రాష్ట్ర ఎన్నికల కమీషనరు నిజాయతీ, నిష్పక్షపాతం పైన జనసేన పార్టీ అనుమానాలు వ్యక్తం చేయటం విశేషం.

Nimmagadda
Nimmagadda

ఇవి జనసేన పార్టీ నాయకుల అభ్యంతరాలు Nimmagadda 

16-02-2021న ఎన్నికల కమీషనరు విడుదల చేసిన వివరణ మోసపూరితంగా ఉంది అనేది ఆ పార్టీ నాయకుల మాట. నాడు 14-03-2020న నామినేషన్ల పరిశీలన జరిగింది. కోన్ని నామినేషన్ల తిరస్కరణ చేయటం, కోన్ని చోట్ల బలవంతంగా వెనక్కి తీసుకుంటున్నట్లుగా లేఖలు బెదిరించి తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే 15-03-2020 ఉదయం 10గంటల సమయానికే ఎన్నికలు వాయిదా వేశారు. కాబట్టి తిరస్కరణ గురైన నామినేషన్ల అప్పీలు చేయటం జరగలేదు. బలవంతంగా బెదిరించి విత్ డ్రా చేసుకున్నట్లు లేఖలు తీసుకోవడం గమనించలేదు. దీనిపైనే గతంలో జనసేన నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వినతి చేశారు. మళ్ళీ మొదటి నుంచి నూతన నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జనసేన అథినేత పవన్కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా ప్రకటన చేసారు.

సవరణ పై కూడా..

ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ లో కొన్ని సవరణ లు చేస్తూన్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల సంఘంకి కానీ, పోలీసులకు కానీ, లేదా ఏదైనా ప్రముఖ పత్రికలలో అచ్చు అయిన వార్తలను అథారంగా చూపిస్తే, సదరు తిరస్కరణకు గురైన నామినేషన్ల యథాతథంగా ఉన్నట్లుగా పరిగణిస్తాము అంటున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీ కీ మాత్రమే అనుకూలంగా ఉండే చర్యగా కానీపిస్తుంది అనేది janasena మాట. దీని వలన జనసేన పార్టీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

Nimmagadda
Nimmagadda

జనసేనకు మీడియా బలం లేదు

నాడున్న పరిస్థితిలో ఎక్కడా జనసేన పార్టీకి జరిగిన అన్యాయాలను ఏ ఒక్క మీడియా చూపలేదు. పత్రిక అచ్చువేయలేదు. పైగా పరిశీలన ముగిసిన 20 గంటలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.. ఈ 20గంటల మథ్యన రాత్రి సమయం 9గంటల నుంచి తరువాత రోజు ఉదయం 8గంటల వరకు లెక్క వేస్తే, షుమారు 12 గంటల సమయం ఉపయోగం లేని సమయం. ఇక మిగిలింది 8 గంటల సమయంలో ఏలా అందరూ తమకు జరిగిన అన్యాయం పైన స్పందిస్తారు అనేది ప్రశ్న.

** అయితే, మరోక సమస్య నాడున్న మీడియా అసలు జనసేన పార్టీ నాయకుల మీద, విద్యార్థుల మీద చేసిన దాడులను ప్రచురించడం, ప్రసారం చేయటం చేయలేదు. ఇక తెలుగుదేశం అనుకూల మీడియా సైతం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మీద కార్యకర్తల మీద జరిగిన దాడులు చూపించింది. పార్టీకి జరిగిన వాటిని తప్ప, జనసేన, భాజపాకి జరిగిన అన్యాయాలను ఎక్కడా చూపలేదు. పోలీసులు రిపోర్టులు తీసుకోలేదు. నాడు ఎన్నో రిపోర్టులు ఎన్నికలు సంఘంకి పంపినా చర్యలు లేవు. అటువంటప్పుడు ఇటువంటి కంటి తుడుపు నోటిఫికేషన్ కేవలం కేవలం టీడీపీ కీ మాత్రమే లాభం అనేది జనసేన ఆవేదన.
** జనసేన ప్రథాన బలం, బలగం అంతా సోషల్ మీడియా మాత్రమే. అటువంటప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చిన కథనాలను, రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటే జనసేన పార్టీకి న్యాయం జరుగుతుందనీ, లేకపోతే పూర్తిగా అన్యాయం చేయటమే అని వాదిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

** నాడున్న భయోత్పాతం, భయానక వాతావరణం, బెదిరింపుల స్థాయి, అరాచకాలు నామినేషన్ల పర్వంలోనే జరగటం, అవి మునిసిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలలో కూడా ప్రబలంగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగింది. పైగా రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ప్రభుత్వ పెద్దలతో కుమ్ముక్కై, వారికి కోమ్ము కాస్తూ, ప్రత్యర్థి పార్టీల నామినేషన్లను తీసుకోని విథానం, తీసుకున్నా, తిరస్కరించిన విథానం, కోన్ని నామినేషన్ల పత్రాలు అఫీసు బయట చెత్తకుప్పలలో ప్రత్యక్షమైన విథానం, సీసీ కేమెరాలను దుర్వినియోగం చేయటం లాంటి అన్ని రకాల విథానాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, బెదిరింపులు, ప్రలోభాలు చూసినట్లు, అటువంటప్పుడు సామాన్య ప్రజలు పోటీ చేసిన దానిని ప్రమఖ పత్రికలు కొన్ని అచ్చు వేయలేదు. అలాగే పోలీసులు సహకారం అధికారపార్టీకి ఉంటే పోలీసు స్టేషన్ లో ఏలా తక్కువ సమయంలో రిపోర్టు చేయగలుగుతారు? అన్నది ప్రశ్న. దుర్మార్గాలు, అక్రమాలలో రిటర్నింగ్ అధికారులు భాగమైనప్పుడు స్పందించని ఎన్నికలు సంఘం, ఇప్పుడు వాటిని చూపండి అని అడగటం, నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరికాదని చెబుతున్నారు.

Nimmagadda
Nimmagadda

మళ్ళీ కోర్టులోకి ఎన్నికల వివాదం?

ఇప్పటికే పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కిన ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల వ్యవహారం మరోసారి కూడా కోర్టు మెట్లు ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్న దానిని బట్టి ఒకటి పాత నోటిఫికేషన్ రద్దు చేసి, నూతన నోటిఫికేషన్ ఇవ్వటం మొదటి నుంచి ప్రక్రియ మొదలు పెట్టడం లేదా రెండోవది, కనీసం నాడు నామినేషన్ల వేయలేని వారందరికీ మరలా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశాలు కలిపించటం చేస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు .

ఇకపోతే మూడో ప్రత్యామ్నాయం గా సుప్రీంకోర్టు తలుపు తట్టటం, చేయాలనీ ఆ పార్టీ భావిస్తోంది. అన్యాయం పైన ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేయాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మీడియా ముఖంగా ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని కోరారు. ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన లక్ష్యం సైతం ఎన్నికలు నెగ్గడం కంటే మొదట ఎన్నికలను మొదటినుంచి నిర్వహించేలా చూడడమే అని తెలుస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju