ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Tatineni Ramarao: సినీ డైరెక్టర్ తాతినేని కన్నుమూత

Share

Tatineni Ramarao: టాలివుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి చెందారు. గత కొద్ది రోజులుగా చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల హాస్పటల్ లో చికిత్స పొందుతన్న తాతినేని రామారావు మంగళవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.

Film Director Tatineni Ramarao passed away
Film Director Tatineni Ramarao passed away

Tatineni Ramarao: 50కిపైగా చిత్రాలకు దర్శకత్వం

1938 లో కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో తాతినేని రామారావు  జన్మించారు. 1962 నుండి 2000 సంవత్సరం వరకు తెలుగు, హిందీ భాషల్లో కలిపి సుమారు 50కిపైగా చిత్రాలను ఆయన దర్శకత్వం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ యమగోల చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. తాతినేని రామారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


Share

Related posts

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక కొత్త తేదీ..లేటెస్ట్ న్యూస్ ??

sekhar

Samantha: దానికీ ఓ ముగింపు ఉంటుంది.. స‌మంత సంచ‌ల‌న పోస్ట్‌!

kavya N

AIIMS Chief DR Randeep Guleria: కరోనా నిర్ధారణకు సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar