33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసు నిప్పు

Share

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ కార్యాలయానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో బోరుగడ్డ అనిల్ బాగా వైరల్ అయ్యారు. కోటంరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం, నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి ఈచ్చుకుంటూ వెళతానంటూ సవాల్ విసిరారు అనిల్. సీఎం జగన్ గురించి ఏమీ మాట్లాడవద్దంటూ హెచ్చరికలు జారీ చేసారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని అనిల్ బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.

fire at borugadda anil office

 

అనిల్ గతంలోనూ పలువురిని ఇదే రీతిలో హెచ్చరించారు. రిపబ్లక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అనిల్ .. వైసీపీ సపోర్టర్ గా, సీఎం వైఎస్ జగన్ అభిమానిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైసీపీని, జగన్ ను విమర్శించి వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటాడని సమాచరం. అయితే తాజాగా కోటంరెడ్డి పై బెదిరింపులకు పాల్పడిన తర్వాత గుంటూరులోని అనిల్ కార్యాలయానికి పెట్రోల్ పోసి తగులబెట్టడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై అనిల్ కుమార్ స్పందిస్తూ ఇది స్థానిక టీడీపీ నాయకుల దుశ్చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోలీసు దర్యాప్తులో ఈ ఘటనకు కారకులు ఎవరు అనేది తేలే అవకాశం ఉంది.

Road Accident: నిద్ర మత్తులో కారు డ్రైవింగ్ .. తీవ్ర విషాదం


Share

Related posts

ఈ 3 విభాగాల‌కు చెందుతారా..? అయితే ఆదాయం లేకున్నా ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయాల్సిందే..!

Srikanth A

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

bharani jella

అయ్యయ్యో పవన్ కల్యాణ్ .. ఎంతపని జరిగింది అంటున్న ప్రత్యర్ధులు !!

sekhar