Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడిపోయాయి. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఆటోలో 13 మంది ఉండగా అయిదుగురు సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఆటోపై ఇనుప సామాన్లు ఉండటంత ఈ ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మృతి చెందిన వారిది తాడిమర్రి మండలం గడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. గ్రామానికి చెందిన అయిదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంతో గడ్డంపల్లి గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఇలాంటి ఘటనే ఆరు రోజుల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు బైక్ పై పొలానికి వెళుతుండగా విద్యుత్ వైరు తెగి వీరి మీద పడటంతో ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. విద్యుత్ వైర్లు తెగి పడి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ముందస్తు మరమ్మత్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…