Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలగొడు మండలానికి చెందిన పలువురు జీపులో కర్ణాటక రాష్ట్రం కలబురిగిలో దర్గా ఉరుసు జాతరకు వెళుతుండగా యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మునీరు (40), నయామత్ (40), రమీజా బేగం (50), ముద్దత్ షీర్ (12), సమ్మి (13) మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల జరిగిందా లేక అతి వేగమే ప్రమాదానికి కారణమా అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలనున్నది.
మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?