సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలంగా వచ్చిన బొలెరో వాహనం ఆటోను ఢీకొనడంతో అయిదుగురు దుర్మరణం పాలైయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆటో- బొలెరో వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతుల్లో మల్లేశ్, ఈశ్వరయ్య, రంగస్వామి, హజీపీరా, నారాయణ స్వామిగా గుర్తించారు. వీరంతా బత్తలపల్లి నుండి ధర్మవరం కు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ..ఈ కీలక అంశాలపై చర్చ
‘ఈ ఫార్మలా అప్పుడెందుకు చెప్పలేదో!?’