CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫ్లిప్ కార్ట్ సీఈఓ భేటీ..! ఈ కీలక అంశాలపై చర్చ..!!

Share

CM YS Jagan: ప్రముఖ ఈ – కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ఉన్నతాధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ఫ్లిప్‌కార్టు సీఈఓ కృష్ణమూర్తికి సీఎం వివరించారు. రైతాంగానికి విత్తనం అందించడం మొదలు కొని వారి పంటలు కొనుగోలు వరకూ ఆర్బీకేలు కీలకంగా నిలుస్తున్నాయని చెప్పారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిక్ కార్టు దోహదపడాలని సీఎం కోరారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో ఫ్లిప్ కార్టు భాగస్వాములు కావాలనీ, మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహయపడాలనీ కోరారు.

Flipcort CEO Krishnamurthy meet CM YS Jagan

ప్పటికే ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్ ఉందనీ, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.  తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతుల నుండి ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ కు ఫ్లిప్ కార్టు సీఈఓ తెలిపారు. ఇది తమ సంస్థకు, రైతులకు ప్రయోజనం కల్గిస్తుందనీ, మంచి టెక్నాలజీ అందించేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. విశాఖపట్నం ఐటీ, ఈ – కామర్స్ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం పిలుపుఇచ్చారు. నైపుణ్యాల మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామనీ,  ఇందులో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనపై ఫ్లిప్ కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే విశాఖలో తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయనీ, మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అవుతామని వెల్లడించారు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago