NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!

ఈ సారి పోలింగ్‌లోనూ గ్రామీణ ఓట‌ర్లే స‌త్తా చాటారు. ఏపీలో జ‌రిగిన గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ గ్రామీణ ప్రాం తాల్లో ఓట్లు జోరుగా ప‌డ్డాయి. ఇప్పుడు కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలు, ప‌ల్లెల్లో ఓటేశారు. సాధార‌ణంగా గ్రామీణ ప్రాంతాల‌ను చూసుకుంటే.. నిర‌క్ష‌రాస్యులు ఎక్కువ‌గా ఉంటార‌నే అభిప్రాయం ఉంది. ఇది నిజం కూడా కావొచ్చు. అయితే.. ఇక్క‌డ మ‌రోవిష‌యం కూడా ఉంది. వీరు రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న ఓట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌ట్టం క‌ట్టిన వారు.. త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా మారారు. అందుకే .. వైసీపీకి ఎంత వ్య‌తిరేక‌త ఉన్నా.. ప‌ట్ట‌ణాల‌కంటే కూడా.. గ్రామీణ ఓట్ల‌పై ఈ పార్టీ నేత‌లు ఆశలు పెట్టుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ ఓటు బ్యాంకు అంతా కూడా… వైసీపీకి దాదాపు అనుకూలం. అయితే.. ఇదే పంథా ఇప్పుడు కూడా క‌నిపించిందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. టీడీపీ ఈ ఓటు బ్యాంకుపైనా ప్ర‌భావం చూపించింది. వ‌లంటీర్ల‌ను పెట్టి మ‌రీ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌చారం చేయించింది.

దీంతో వైసీపీ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం చూపించి.. టీడీపీవైపు తిప్పుకోవాల‌న్నది ప్ర‌శ్న‌. మ‌రోవిష‌యం ఏంటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క‌సారి క‌నుక నాయ‌కుడిపై న‌మ్మ‌కం క‌లిగితే.. ఇక‌, వారంతా కూడా ఆనాయ‌కుడికే జై కొడ‌తారు. గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు కూడాఇదే త‌ర‌హా ఫ‌లితం క‌నిపించింది. 2004లో విజ‌యంద‌క్కించుకున్న ఆయ‌న‌.. రైతుల‌కు మేలు చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఆర్బీకేలు.. రైతు భ‌రోసా వంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు.

వీటితోపాటు ఇంటికే పింఛ‌న్లు పంపిస్తున్నారు. దీంతో వీరంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నార‌నేది ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. అంత‌కు మించి తాము చేస్తామ‌ని చెప్పినందున‌.. టీడీపీ కూడా అంతే ఆశ‌లు పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓట‌రు నాడిని ప‌ట్టుకునేందుకు త‌మ‌వైపు తిప్పుకొనేందు కు ఇరు ప‌క్షాలు కూడా శ‌క్తివంచ‌న లేకుండానే ప్ర‌య‌త్నించాయి. ఎప్ప‌టి లాగానే.. గ్రామీణ ఓట‌ర్లు ముఖ్యంగా వృద్ధులు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. మ‌రి ఏమేర‌కు వీరు వైసీపీని మేలు చేస్తారు? ఏమేర‌కు కూట‌మికి మ‌ద్ద‌తిస్తార‌నేది చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?