Machilipatnam: బందరు పోర్టు నిర్మాణ పనులను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బందరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం తమకు మాటల్లేని ఆనందం అన్నారు. పోర్టు కోసం గత 19 సంవత్సరాల నుండి ప్రభుత్వాల వెంట పడ్డామన్నారు. పోర్టు ప్రైవేటు చేతికి వెళ్లే ఎప్పటికీ పూర్తి కాదని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భావించారనీ అందుక బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తొందని అన్నారు పేర్ని నాని. వైఎస్ఆర్ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఈ భూమి ఉన్నంత వరకూ బందరు పోర్టు ప్రజల ఆస్తి అని అన్నారు.

పోర్టు నిర్మాణం కోసం రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేయలేదనీ, వందకు వంద శాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. బందరు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖ చిత్రం మారబోతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి వరకూ కలగా ఉన్న పోర్టు నిర్మాణం ఈ రోజు సాక్షాత్కారం కానున్నదనీ, వంద శాతం ఈ క్రెడిట్ సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. తండ్రి (వైఎస్ఆర్) సంకల్పాన్ని తనయుడు (జగన్) నెరవేరుస్తున్నారని తెలిపారు. పోర్టు నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
గతంలో అనేక మార్లు బందరు రావాలని సీఎం జగన్ ను ఆహ్వానించాననీ ఆ సమయంలో గత ప్రభుత్వం మాదిరిగా మనం మోసం చేయవద్దని సీఎం జగన్ చెప్పారన్నారు. పోర్టు పనుల ప్రారంభోత్సవానికే బందరు వస్తానని చెప్పారన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పేర్ని నాని. సెల్ఫీ డ్రామాలు ఆడే కమల్ హాసన్, గుమ్మడి, రేలంగిలను చూడలేకపోతున్నామన్నారు. చంద్రబాబు ఆయన ముఠా .. పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ కట్టాలని ఏనాడైనా ఆలోచన చేసారా అని ప్రశ్నించారు. మాటలు చెప్పే వారికి, పనులు చేసే వారికి ఇదే తేడా అని పేర్ని నాని అన్నారు.