NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

JD Lakshmi Narayana: రాజకీయ ప్రస్థానంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ .. మళ్లీ పాత పాటే(గా)..!

JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గురించి తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి, రాజకీయ వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో దర్యాప్తు అధికారి గా వ్యవహరించి, ఆయనను అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పాపులర్ అయ్యారు. ఆయన పేరు వీవీ లక్ష్మీనారాయణ అయినప్పటికీ ఆయన నిర్వహించిన హోదా జేడీ ఇంటి పేరుగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావడానికి ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యావంతులు, యువత, మేదువుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ లక్ష్మీనారాయణ.

JD Lakshminarayana

పదవీ విరమణ చేసిన తొలి నాళ్లలో సొంతంగా రాజకీయ పార్టీ పెడతారని ఊహాగానాలు వచ్చాయి. ఆయన కూడా ఆ దిశగా అడుగులు వేశారు. వివిధ వర్గాలతో చర్చలూ జరిపారు. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగా రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. లక్ష్మీనారాయణ ప్రభావంతోనే అక్కడి  వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ కేవలం 4,400 స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విభేదించి ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. అయితే 2024 ఎన్నికల్లోనూ విశాఖ నుండే పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు.

అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీలో ఇప్పటి వరకూ చేరలేదు. అయితే తన ఆశయాలు, భావాలు నచ్చి ఆహ్వానించిన పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లను ప్రశంసించడంతో వైసీపీ లో చేరి విశాఖ నుండి పోటీ చేస్తారనే ప్ర చారం కూడా జరిగింది. గతంలో జేడీ లక్ష్మీనారాయణపై తీవ్ర ఆగ్రహంతో విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు విపక్షాల మాదిరిగా ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయకుండా ప్రభుత్వ స్కీమ్ లను ఆయన ప్రశంసిస్తుండటంతో వైసీపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. అయితే జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తన దైన శైలిలో ముందుకు వెళుతూ ఉన్నారు. తాజాగా తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు జేడీ లక్ష్మీనారాయణ.

ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పిన లక్ష్మీరాయణ.. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలని అన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖలో మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫెర్ కు 50 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. అక్కడే ఆపర్ లెటర్ లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచెం వెనుకబడే అభ్యర్ధుల కు స్కిల్ డవలప్ మెంట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. పదవ తరగతి ఆ పై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ మోళాకు హజరు కావచ్చని లక్ష్మీనారాయణ చెప్పారు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అవసరమైతే సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందని అన్నారు అంటే.. ప్రధాన రాజకీయ పార్టీలో ఏదైనా ఆయనను ఆహ్వానించి టికెట్ కేటాయించినట్లయితే ఆ ఆలోచన చేసే అవకాశం లేదని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ తరపున పోటీ చేసినా లక్ష్మీనారాయణ గెలుపు నల్లేరుపై నడికే అని చెప్పవచ్చు. ఎందుంటే .. విశాఖ నియోజకవర్గంలో పార్టీ బలానికి తోడు ఆయన వ్యక్తిగత ఇమేజ్ తోడవుతుంది. ఒక వేళ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై ఆయన చీలిక ఓట్ల ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. చూడాలి ఏమి జరుగుతుందో..!

CM YS Jagan: నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో రేపు సీఎం జగన్ పర్యటన

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju