NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha Steel Plant Issue: ఏపి తెలంగాణ సర్కార్ లకు మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ కీలక ప్రతిపాదన .. కేసిఆర్ ఓకే .. జగన్ ఏమంటారో..?

Visakha Steel Plant Issue: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునే అంశంపై సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా, ఏపి, తెలంగాణ సర్కార్ లు లేఖలు రాసినా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తున్న వీవీ లక్ష్మీనారాయణ తాజాగా ఏపి తెలంగాణ సర్కార్ లకు కీలక వినతి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపి సర్కార్ చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)కు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

Former CBI JD VV Lakshmi Narayana key proposal to ap and Telangana govt on visakha steel plant issue

 

హిందూస్తాన్ న్యూస ప్రింట్ లిమిటెడ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదల్చుకోగా కేరళ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు, దీన్ని కేరళ పేపర్ ప్రొడక్స్ లిమిటెడ్ గా బదలాయించిందని, దీని కోసం రూ.146 కోట్లతో బిడ్స్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్దరించడానికి ఏపి, తెలంగాణ సర్కార్ లు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. తక్షణమే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపి లేదా తెలంగాణ ప్రభుత్వాలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎన్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)లో పాల్గొనాలని అన్నారు లక్ష్మీనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి పదార్ధాల సరఫరా, ప్లాంట్ నిర్వహణ కు అవసరమైన ప్రైవేటు కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఎపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ బిడ్డింగ్ లో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకు కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల బిడ్డింగ్ లో సింగరేణి లేదంటే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదంటే నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాల్న లక్ష్యంతోనే సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా ఆసక్తి వ్యక్తీకరణ కోసం వెంటనే విశాఖకు వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం కేసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లోనే విశాఖ వెళ్లనున్న బృందం .. యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.

చంద్రబాబు వద్దకు చిలకలూరిపేట పంచాయతీ .. పత్తిపాటి వర్సెస్ భాష్యం ప్రవీణ్ .. రంగంలోకి దిగిన అచ్చెన్నాయుడు

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk