NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు.. ఎందుకంటే..?

Bhuma Akhila Priya:  టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా ఇవేళ మధ్యాహ్నం 3 గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద బయటపెడతాననీ భూమా అఖిలప్రియ సవాల్ చేసిన నేపథ్యంలో.. ఆమె నంద్యాలకు వెళ్లకుండా నిరోధించేందుకు పోలీసులు ఆళ్లగడ్డలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాటు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Bhuma Akhila Priya

 

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య రాజకీయ వైరం తారా స్థాయిలో ఉంది. ఇరువురి మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్దం కొనసాగుతోంది. ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ వైపు ఉందంటూ ఇటీవల భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ.. శిల్పా రవి టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని తెలిసిందనీ, టీడీపీలో చేరేందుకు ప్లాట్ ఫాం సిద్దం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నంద్యాల జిల్లాలో తీవ్ర సంచలనం అయ్యాయి.

ఇదే క్రమంలో శిల్పా రవి అవినీతి, అక్రమాలు బయటపెడతానంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు.  ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్య అక్రమాల చిట్టా తీసుకువస్తాననీ, తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా అఖిలప్రియ సవాల్ తో పోలీసులు అలెర్ట్ అయ్యారు. భూమా అఖిలప్రియను నంద్యాలకు వెళ్లకుండా ఆళ్లగడ్డలోనే హౌస్ గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju