నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గ్రూపు విభేదాల నేపథ్యంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. సుబ్బారెడ్డి ఫిర్యాదుపై అఖిలప్రియ, ఆమె భర్త భర్గవరామ్ మరి కొందరు ఆమె అనుచరులపై పోలీసులు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే జైలులో ఉన్న అఖిలప్రియ గత రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురైయ్యారు. దీంతో అఖిలప్రియను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు పోలీసులు. మహిళా సబ్ జైలులో ఉన్న అఖిలప్రియ తనకు ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో జైలు సూపర్నిటెండెంట్ వెంటనే పోలీసు బందోబస్తు నడుమ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు క్యాజువాలిటీలో వైద్యలు ఈసీజీ పరీక్ష నిర్వహించిన అనంతరం కార్డియాలజీ విభాగానికి పంపారు. అక్కడ కూడా ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేశారు. అయితే అన్ని రిపోర్టులు నార్మల్ గా రావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆమె ను తిరిగి మహిళా జైలుకు తరలించారు.
YS Avinash Reddy: సీబీఐకి మరో సారి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కడప ఎంపి అవినాష్ రెడ్డి