YSRCP: టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్న మరో మాజీ మంత్రి..! ఎవరంటే..?

Share

YSRCP: టీడీపీ నుండి అధికార వైసీపీకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. గడచిన ఎన్నికల తరువాత అనేక మంత్రి టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు సైతం అనధికారికంగా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు.

Former minister joining YSRCP
Former minister joining YSRCP

మంగళగిరి నియోజకవర్గం నుండి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగుడు హనుమంతరావు గతంలో ఆప్కో చైర్మన్ గా,  మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో హనుమంతరావు టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీపై అసంతృప్తితో ఉన్న హనుమంతరావు టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.


Share

Related posts

Sakshi Agarwal Beautiful Photos In Saree

Gallery Desk

Corona Lock Down: ఈ నెల 10వ తేదీ నుండి ఆ రాష్ట్రంలోనూ సంపూర్ణ లాక్ డౌన్

somaraju sharma

సోనూసూద్ కి మద్దతు పలికి బాబు తిట్టించుకున్నాడే…

arun kanna