టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవిబీ బాబు రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుకు గురైయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాబు రాజేంద్ర ప్రసాద్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు హార్ట్ స్ట్కోక్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే వెంటనే ఆయనకు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

బాబు రాజేంద్ర ప్రసాద్ కు యాంజోగ్రామ్ చేసిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గుండె పోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు త్వరగా బాబూ రాజేంద్ర ప్రసాద్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
YS Viveka Case: మరల సుప్రీం కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత