అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

Share

అన్నమయ్య జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. రైల్వే కోడూరు మండలం కమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా .. మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఓబులవారిపల్లి నుండి రైల్వే కోడూరుకు ఆటో వెళుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురు ఉండగా, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు నెలల చిన్నారి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.

 

ఓబులవారిపల్లి మండలం అయ్యలరాజువల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి రైల్వే కోడూరులో కాపురం ఉంటున్నాడు. తన కుమారుడు అన్న ప్రాసన వేడుక నిర్వహించుకునేందుకు కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఆ తరువాత వీరు ఆటో లో రైల్వే కోడూరు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పమాదంలో అన్నప్రాసన నిర్వహించిన చిన్నారితో పాటు కృష్ణారెడ్డి కూతురు సాయి (8), భార్య పెంచలమ్మ (30), అతని అత్త మరణించారు. ఆటో డ్రైవర్ బాలకృష్ణ, కృష్ణారెడ్డిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో అయ్యలరాజుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

47 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

56 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago