Subscribe for notification

Gas Cylinder Explosion: అనంతలో ఘోర దుర్ఘటన.. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి

Share

Gas Cylinder Explosion: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలెండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దుర్మరణం పాలైన వారిలో మూడేళ్ల పసిపాప కూడా ఉంది. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో ఈ తెల్లవారుజామున దుర్ఘటన జరిగింది. ములకలేరు గ్రామంలో రజాక్ నివాసం పక్క ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి రజాక్ నివాసం కుప్పకూలింది. ఈ ఘటనలో జైనాభి (60), ఆమె కుమారుడు దాదు (36), కొడలు సర్ఫున్ని (28), మూడేళ్ల మనుమరాలు బేబీ అక్కడికక్కడే మృతి చెందారు.

Four persons Died in Gas Cylinder Explosion anantapur district

శిధిలాల కింద పడిన ఆరుగురులో పై నలుగురు మృతి చెందగా రజాక్, అబ్దుల్లా లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ కళ్యాణ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తొంది. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం పాలవ్వడంతో గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు.


Share
somaraju sharma

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

12 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

60 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago