Hindupur (sathya sai): శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో మాస్టర్ రఫీక్ ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణా తరగతులను ప్రారంభించారు. సోమవారం నుండి ఈ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మహిళలు, విద్యార్ధులకు వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు.

ఈ క్యాంపులో కరాటే, జూడో, ఆత్మరక్షణ విద్యపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది వేసవి సెలవులను పుస్కరించుకుని ఉచిత కరాటే కోచింగ్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసక్తికల్గిన మహిళలు, విద్యార్ధులు ఇందులో పాల్గొని ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని సూచించారు.
బాలికలు చిన్నతనం నుండే ఇటువంటి విద్యాలో శిక్షణలో పొందితే ఆత్మస్థైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఆకతాయులు, రౌడీల నుండి వారికి వారు రక్షించుకోగలుతారు.
రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. తనదైన బాణీలో కొడాలి