NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Free Ration Distribution: మోడీ ఉచిత బియ్యం వచ్చాయోచ్..! డిసెంబర్ కోటా కూడా ఈ నెలలోనే పంపిణీ..!!

Free Ration Distribution: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్చి నెల వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిన సంగతి తెలిసింది. కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం (పీఎంజీకేఏవై) పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ చేశారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Free Ration Distribution order released
Free Ration Distribution order released

 

Read More: AP CM YS Jagan: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ చర్చలు … జగన్ చెప్పిన ఫైనల్ డెసిషన్ ఇదీ…

Free Ration Distribution: 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం

అయితే గత నెల (డిసెంబర్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి బియ్యం పంపిణీకి సకాలంలో ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఉచిత బియ్యం పంపిణీ జరగలేదు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నేడు ఉచిత బియ్యం (పీఎంజికేఏవై) పంపిణీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం పంపిణీ రేషన్ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ లోగా రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ (పీడీఎస్ గోడౌన్) ల నుండి పిఎంజికేఏవై రైస్ తోలకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల (జనవరి) కోటా 5 కేజీల బియ్యంతో పాటు డిసెంబర్ నెల కోటా 5 కేజీలు కూడా కలిపి పది కేజీల వంతున పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు.

 

మార్చి నెల వరకూ ప్రధాన మంత్రి ఉచిత బియ్యం

కేంద్ర ప్రభుత్వం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజికేఏవై) తీసుకువచ్చింది. మనిషికి 5కేజీల వంతున బియ్యం, కార్డుకు కేజీ కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేసే ఈ స్కీమ్ ను తొలుత 2020 ఏప్రిల్ నెల నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని నవంబర్ 2020 వరకూ పొడిగించారు. ఆ తరువాత ఈ స్కీమ్ ను 2021 మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నాడు కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో నవంబర్ 2020తో నిలుపుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గత ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ కార్డుదారుల్లో సభ్యుడికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.  మరల ఈ ఏడాది మార్చి వరకూ కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగించింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju