NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

G Pay:  గూగుల్ పే కు ఆర్బీఐ అనుమతి లేదా..పేమెంట్స్ సురక్షితమేనా..? కోర్టుకు గూగుల్ ఏమి చెప్పిందంటే..?

G Pay: గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్ అయిన గూగూల్ పే (జీపే) పై ఇటీవల కాలంలో వినియోగదారులకు అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జీపేకు ఆర్బీఐ అధికారిక అనుమతి లేకుండానే ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోందని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు కాగా విచారణ జరుపుతోంది. గూగూల్ పే పేమెంట్ సిస్టమ్ లా వ్యవహరిస్తోందనీ, ఇది పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ యాక్ట్ కు విరుద్ధమని అభిజిత్ మిశ్రా పేర్కొంటున్నారు. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహణకు ఆర్ బీ ఐ నుండి ఎటువంటి అనుమతులు లేవని తన పిల్ లో ఆయన ఆరోపించారు. 2019 మార్చి 20న ఎన్పీసీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే పేరు లేకపోవడాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

G Pay dispute
G Pay dispute

అయితే  ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఆర్ బీ ఐ ఇచ్చిన సమాధానం గూగుల్ పే యూజర్ లను సాధారణ ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టే విధంగా ఉంది. గూగుల్ పే అనేది ఒక యాప్ మాత్రమేననీ, ఇది చెల్లింపులకు ఒక వాహకంగా మాత్రమే పని చేస్తుంది తప్ప దానంతట అదే చెల్లింపుల కార్యకలాపాలు నిర్వహించదని, ఇది పేమెంట్ ఆపరేటర్ కాదని వెల్లడించింది. గూగుల్ పే అనేది థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేననీ, అది ఎలాంటి పేమెంట్ సిస్టమ్ ను నిర్వహించడం లేదని కోర్టుకు ఆర్ బీఐ తెలిపింది. ఈ సమాధానంతో యూజర్ ల గందరగోళానికి కారణం అవుతోంది. గూగుల్ పే చట్టబద్దమైనది కాదని, జీపే ద్వారా కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందులతో కూడుకున్నదని కొందరు నమ్ముతున్నారు.

Read More: Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!

ఈ నేపథ్యంల్ గూగుల్ పే ఒక ప్రకటన విడుదల చేసింది. గూగుల్ పే పూర్తిగా చట్టబద్దమైనదని, యుపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు గూగుల్ పే తన బ్యాంకు పార్టనర్లకు కేవలం సాంకేతిక సేవలను మాత్రమే అందిస్తుందని చెప్పింది. యూపీఐ యాప్ లను థర్డ్ పార్టీ యాప్ లుగా విభజించారు. గూగుల్ పే ద్వారా చేసే చెల్లింపులు అన్ని ఆర్ బీ ఐ, ఎన్సీపీఐ నియమాలకు అనుగుణంగా జరుగుతున్నాయని, అందు వల్ల అవన్నీ పూర్తిగా సురక్షితమైనవని తెలియజేస్తూ.. ఈ విషయంలో ఏలాంటి సమస్యలు తలెత్తినా 24 గంటలు అందుబాటులో ఉండే గూగుల్ పే వినియోగదారుల సెంటర్ల ద్వారా యూజర్లు పరిష్కరించుకోవచ్చని చెప్పింది. ఆర్ బీఐ ప్రకటనను కొందరు సోషల్ మీడియాలో తప్పుడు భాష్యాలను ఆపాదిస్తున్నారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారాలు థర్డ్ పార్టీ యాప్ లు అన్నింటినీ ప్రభావితం చేసేది కాబట్టి లోతైన విచారణ అవసరం అని భావించింది. తదుపరి విచారణన ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju