Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?

Share

Ganesh Festival: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అంటూ ఏపి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణపై ఆంక్షలు విధించిన సంగత తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, టీడీపీ తప్పుబడుతున్నాయి, ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ప్రభుత్వ చర్యలను బీజేపీ, టీడీపీ విమర్శిస్తుండగా వీరు మత రాజకీయాలు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు తిప్పి కొడుతున్నారు. మరో పక్క గుంటూరు పట్టణంలో రోడ్ల పక్కన ఉన్న వినాయక విగ్రహాలను పారిశుద్ద్య చెత్త ట్రాక్టర్ లలో తరలించడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై వెంటనే గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ అనురాధ స్పందించి శానిటరీ సూపర్ వైజర్ ను విధుల నుండి తొలగించారు.

Ganesh Festival controversy in ap
Ganesh Festival controversy in ap

కాగా వినాయక చవితి వేడుకలపై బీజేపీ నేతల బృందం మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చవితి పందిళ్ల కు అనుమతులు ఇప్పించాలని గవర్నర్ ను బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పాతూరి నాగభూషణం, సత్యమూర్తిలు కోరారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండుగను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ మతం మీద హిందూ దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో 150కిపైగా ఘటనలు జరిగినా ఒక్కరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవని అన్నారు.

వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండని ప్రభత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా హాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని కోవిడ్ ఆంక్షలు వినాయక ఉత్సావానికే ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వినాయక చవితి జరుపుకునేలా అనుమతినివ్వాలని కోరామని తెలిపారు. మోహరం, వైఎస్ వర్థంతికి, నామినేటెడ్ పదవుల సభలకు అనుమతి ఇచ్చినట్లే తమకు 50 మందితో అనుమతినివ్వమని కోరుతున్నామన్నారు. గత సంవత్సరం జరగలేదనీ, ప్రస్తుతం కేసులు తగ్గాయి కాబట్టే డిమాండ్ చేస్తున్నామని కన్నా పేర్కొన్నారు. అయితే బీజేపీ నేతల విజ్ఞప్తిపై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

1.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!

2.AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

3.AP Govt: ఇది జగన్ సర్కార్ ‌కు భారీ ఊరట..! హస్తినలో మంత్రి బుగ్గన ప్రయత్నాలు ఫలించినట్లే..!!

 


Share

Related posts

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు ఏమిటో తెలుసుకుందాం

Kumar

కమలం వైపు కదులుతున్న పనబాక దంపతులు? కానీ ఒకే ఒక్క కండిషన్ !!

Yandamuri