21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే వంశీ ఎక్కడ..? వారం రోజులుగా సైలెంట్.. తీవ్ర అసంతృప్తి..?

Share

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమైయ్యారు..? ఎక్కడ ఉన్నారు..? నియోజకవర్గంలో ఏమైనా పర్యటిస్తున్నారా..? లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే చోట ఏక్కడైనా ఉన్నారా..? అసలు ఆయన ఈ పది రోజుల నుండి సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ? అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుండి గెలిచిన అయిదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టి మద్దతు పలికారు. అందులో వల్లభనేని వంశీ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేసినప్పటి నుండి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరిలోనూ ఒక అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే వీరద్దరూ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. ఎన్టీఆర్ కు వీరభక్తులు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టే విషయంలో వీరు తీవ్రంగా కృషి చేశారు. సక్సెస్ అయ్యారు. కాకపోతే హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చకుండా ఆపలేకపోయారు. అందుకు వీరిలో కొంత అసంతృప్తి ఉంది. ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వల్లభనేని వంశీ బాధితుడు అవుతారు.

Vallabhanenni Vamsi

 

ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరం నియోజకవర్గంలోనే ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో కొంత సెంటిమెంట్ ఉంది దానికి తోడు వల్లభనేని వంశీతో సహా ఆయన వర్గీయులు అందరూ దివంగత ఎన్టీఆర్ అభిమానులు కావడంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు ఉంచలేకపోయారు అన్న అపవాదు వంశీ మూటగట్టుకోవాల్సి వస్తొంది. అందుకు వల్లభనేని వంశీ ఇటు పార్టీకి చెప్పలేక, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఒప్పించలేక, అటు నియోజకవర్గ ప్రజలకు, తన అభిమానులకు సర్దిచెప్పులేక, ఓటర్ల మనోభావాలు దెబ్బతింటున్నా చూస్తూ ఉండలేక కాస్త సైలెంట్ గా ఉన్నారు. బయటకు ఏమి మాట్లాడితే ఏమి వస్తుందో.. ? అటు మింగలేక కక్కలేక అన్న సామెత పరిస్థితిలో వంశీ ఉన్నారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డికి అయితే ఓ లేఖ రాాశారు. ఈ అంశంలో పునరాలోచన చేయాలని లేఖలో కోరారు వంశీ. వంశీ లేఖ రాసిన తర్వాత సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగానే ఎందుకు హెల్త్ యూనివర్శిటీకి పేరు మారుస్తున్నారో వివరణ ఇచ్చారు. డాక్టర్ వైఎస్ఆర్ వైద్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా, వైద్య కళాశాలలు నెలకొల్పడం వల్ల స్వతహాగా వైద్యుడైన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మారుస్తున్నట్లు స్పష్టం చేశారు.

NTR Health University

 

కాకపోతే గన్నవరం నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన అసంతృప్తి నుండి బయటకు రాలేదు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ తరువాత కూడా ఈ అంశంపై కొడాలి నాని మీడియాతో ఏమి మాట్లాడలేదు. వంశీ మాత్రం సీఎం కు లేఖ రాశారు గానీ ఆ తర్వాత రెస్పాండ్ కాలేదు. మీడియాకు, సన్నిహితులకు కూడా అప్పటి నుండి అందుబాటులో లేరు. ఆ రోజు నుండి ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి నియజకవర్గంలోని ఆయన అనుచరులకు కూడా దూరంగా ఎందుకు ఉన్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా ఉంది. ఈ అంశంగా అలక వహించారు, అసమ్మతిగా ఉన్నారు అనే దాని కన్నా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఆ సంతృప్తి కారణంగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ గా ఉండిపోయారని భావిస్తున్నారు.

Gannavaram

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు

 

హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చిన సమయంలో తన సన్నిహితుల వద్ద రాజకీయాల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, ఎన్టీఆర్ సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకూ 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఏడు సార్లు టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. వల్లభనేని వంశీ కూడా రెండు పర్యాయాలు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి బలమైన గాలి వీచినా వంశీ టీడీపీ తరపున గెలుపొందారు. నియోజకవర్గంలోని ప్రజల ఎమోషన్స్ ను అటు పార్టీ పెద్దలకు చెప్పలేక, ప్రభుత్వ నిర్ణయాన్ని తన వర్గీయులకు, నియోజకవర్గ ప్రజలకు సర్దిచెప్పుకోలేని సందిగ్దావస్థలో వల్లభనేని వంశీ ఉండిపోయారు అని అందుకే సైలెంట్ గా ఉండిపోయారు అని చెప్పవచ్చు.

చంద్రబాబు సీరియస్ నిర్ణయం .. ఆ 75 మంది ఇన్ చార్జిల్లో ఎవరెవరు ఔట్ ..?


Share

Related posts

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

somaraju sharma

AP Telangana Water War: పులివెందుల పులి బిడ్డ ఏంటి ఆలా తగ్గిపోయాడు..! కేసీఆర్ అంటే భయపడుతున్నట్లేనా..!?

somaraju sharma

సంఖ్యశాస్త్రం ప్రకారం ప్రమాదకరమైన నంబర్స్ ఇవే!!

Kumar