NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ganta Srinivas Rao : బాబుకు అదిరిపోయే షాకిచ్చిన గంటా శ్రీ‌నివాస‌రావు .. జ‌గ‌న్ కు తీపిక‌బురే!

ysrcp and tdp not caring ganta srinivasa rao

Ganta Srinivas Rao : గంటా శ్రీ‌నివాస‌రావు .. కొద్దిరోజుల కింద‌టి వ‌ర‌కు ఆయ‌న ఓ ర‌క‌మైన విశ్లేష‌ణ‌తో వార్త‌ల్లోకి ఎక్కితే గ‌త ప‌దిమేను రోజులుగా ఇంకో ర‌క‌మైన ప‌రిణామంలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల గుర్తింపున‌కు కేంద్రంగా నిలిచిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాలు త‌మ‌దైన శైలిలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో గంటా శ్రీ‌నివాస‌రావు రాజీనామా చేశారు. దానికి కొన‌సాగింపుగా మ‌రిన్ని ప‌రిణామాల‌తో ఆయ‌న వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ysrcp and tdp not caring ganta srinivasa rao

టీడీపీ ఎమ్మెల్యే గంటా Ganta Srinivas Rao ఏం చేస్తున్నారంటే…

గంటా శ్రీ‌నివాస‌రావు ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే సంగ‌తి తెలిసిందే. కానీ ఆ పార్టీ కార్య‌క‌లాపాల్లో ఆయ‌న క్రియాశీలంగా పాల్గొన‌డం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100 శాతం స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారని.. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగానే ఆర్ధిక మంత్రి స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. పోస్కో, NMDC,RINLమధ్య వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందని ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి రాతపూర్వకంగానే చెప్పారని తెలిపారు. ప్రయివేటీకరణ విధానంతో పాటు మానవత్వం ఉండాలని.. ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగుల భద్రత, ప్లాంట్ భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప‌వ‌న్ గురించి కూడా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని… జనం ఆందోళనలో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుందని గంటా శ్రీ‌నివాస‌రావు విమర్శించారు. బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాన్ కు ఎక్కువ బాధ్యత, హక్కు ఉందని… పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం ప్రకటించాలి… స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు సిద్ధపడాలని కోరారు. తన రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందన్నారు. కాగా, గ‌తంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ లేఖ రాస్తే కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన గంటా శ్రీ‌నివాస‌రావు … టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానికి రాసిన లేఖ‌పై మాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

author avatar
sridhar

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N