Garuda bus accident: ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు ఒక్క సారిగా ప్రమాదానికి గురైంది. చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో అదుపుతప్పి గరుడ బస్సు బోల్తా కొట్టి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తొంది.

లైట్లు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణీకులు అందరూ ఆందోళనకు గురైయ్యారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ హాని జరగకుండా గాయాలతోనే ప్రయాణీకులు బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణీకులను వేరే బస్సులో హైదరాబాద్ తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఏపిఎస్ ఆర్టీసీ లో భారీగా జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ .. అధికారులు ఇస్తున్న క్లారిటీ ఇది