Jammalamadugu (YSR): వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడులో గ్యాస్ సిలెండర్ పేలుడుతో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సాత్రి జేమ్స్, మరియమ్మ దంపతుల ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. దీంతో వారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

దంపతులు ఆరు బయట నిద్రిస్తుండగా, ఇంట్లో నుండి పెద్ద శబ్దం వినిపించడంతో వీరు లోపలకి వెల్లి లైట్ వేసి చూడగా, ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలు వీరికి అంటుకున్నాయి. గాయపడిన వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka Congress: ఉమ్మడి కృషితో కాంగ్రెస్ ఘన విజయం .. సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ