NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gautam Sawang: గౌతమ్ సవాంగ్ ప్రతిపక్షాలకు అనుకూలమా..?ఇదేనా ఫ్రూఫ్..!!

Gautam Sawang: సాధారణంగా వివిధ శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలు ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే అధికారులకు పోస్టింగ్ లు ఉంటాయి. కీలకమైన స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్లను నియమించుకుంటుంటారు. వారిలో ఏమైనా తేడా కనబడితే ఆ స్థానాల నుండి తప్పిస్తుంటారు. చంద్రబాబు అయినా, జగన్ అయినా తమకు అనుకూలమైన అధికారులనే కీలక స్థానాల్లో వారికి ఇష్టమైన అధికారులను నియమించుకోవడం రివాజు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఏపి డీజీపీగా దాదాపు 30 నెలలు పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను జగన్ సర్కార్ బదిలీ చేయడంతో టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వం ఆయనకు అన్యాయం చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

Gautam Sawang transfer issue
Gautam Sawang transfer issue

 

Read More: Breaking: గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పోస్టు ఇచ్చిన జగన్ సర్కార్

Gautam Sawang: ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు

గౌతమ్ సవాంగ్ నిజాయితీ అధికారి అని పేరు ఉన్నప్పటికీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. పలు సందర్భాల్లో డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు కానీ వైసీపీ నాయకులు ర్యాలీలు నిర్వహించినా, బహిరంగ సభలు పెట్టినా వారిపై ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అనేక సందర్బాల్లో గగ్గోలు పెట్టింది.

వారి ఆవేదన అందరికీ ఆశ్చర్యం

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంటూ కూడా చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అలా నిన్న మొన్నటి వరకూ విమర్శించిన నేతలే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయడంతో ఆవేదన చెందుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. వాస్తవానికి గౌతమ్ సవాంగ్ బదిలీ అవుతున్నారు అనే కంటే ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వస్తున్నారన్న బాధే ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. గౌతమ్ సవాంగ్ ను అడ్డగోలుగా వాడుకుని జగన్ వదిలేశారని టీడీపీ ఆరోపిస్తుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?