Corona: తెలంగాణ‌లో ఉంటున్నారా… క‌రోనా స‌మ‌యంలో ఇదో తీపిక‌బురు

Share

Corona: మీరు తెలంగాణ‌లో ఉంటున్నారా? క‌రోనా క‌ష్ట‌కాలం స‌మ‌యంలో ఇదో తీపిక‌బురు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి మాన‌వాళి ముందు ఉన్న ఏకైక ఆప్ష‌న్ వ్యాక్సినేష‌న్ కాగా గ‌త కొద్దికాలంగా వ్యాక్సిన్ కొర‌త వేధిస్తోంది. మే 1వ తేదీ నుంచి విసృత్తంగా వ్యాక్సిన్ వేయాల్సిన స‌మ‌యంలో వ్యాక్సిన్ల కొర‌త వ‌చ్చింది. దీంతో భార‌త ప్ర‌భుత్వం విదేశీ వ్యాక్సిన్ల‌కు సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప్ర‌య‌త్నం ఫ‌లితాలు స్తోంది.

ఇది విష‌యం…

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క‌రోనా క‌ట్ట‌డిలో మంచి ఫ‌లితాల‌ను ఇచ్చినట్లు నిర్ధార‌ణ అయింది. ఈ వ్యాక్సిన్‌ను ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాలో భారీగా కొనుగోలు చేయ‌గా భార‌త్ కూడా ఆ జాబితాలో చేరింది. వ్యాక్సిన్ల‌కు ఆర్డ‌ర్ చేసింది. మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి సంబంధిత స‌రుకు ర‌వాణ విమానం చేరింది. ఈ వ్యాక్సిన్ల‌ను డెలివ‌రీ చేసేందుకు డాక్ట‌ర్ రెడ్డీస్ సిద్ధ‌మైంది. దీంతో వ్యాక్సిన్ల కొర‌త స‌మస్య తీర‌నుంది.

మ‌న హైద‌రాబాదీ కంపెనీయే త‌యారు చేసేది

స్పుత్నిక్ వీ యొక్క సమర్థత ప్రపంచంలోనే అత్యధికంగా తేలింది. ఈ టీకా కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ల‌కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంద‌ని ప‌లు దేశాలు భావిస్తున్నాయి. భార‌త్‌లో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేర‌కు స్థానిక ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. సంవత్సరానికి 850 మిలియన్ డోసులు వరకు పెంచాల‌న్న‌దే త‌మ ప్లాన్ అని భారతదేశంలోని రష్యన్ రాయబారి వెల్ల‌డించారు. కోవిడ్‌ను ఎదుర్కోవటానికి రష్యా మరియు భారతదేశం అంకితభావంతో ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగిస్తున్నందున, కోవిడ్ సెకండ్ వేవ్‌కు బ్రేక్‌లు వేసేందుకు మరియు ప్రాణాలను కాపాడటానికి భారత ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఈ చర్య చాలా ముఖ్యం అని భార‌త్‌లోని రష్యన్ రాయబారి తెలిపారు.


Share

Related posts

ఇదేమి రంగుల పిచ్చి!?

somaraju sharma

బ్రేకింగ్: ఐపీఎల్ 2020కు సురేష్ రైనా దూరం

Vihari

KGF 2 : నైజాంలో రికార్డు సృష్టించిన కేజిఎఫ్-2 రైట్స్..!!

sekhar