Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థల వివాదంపై తేలని పంచాయతీ – అసంపూర్తిగా ముగిసిన చర్చ..!!

Share

Hanuman Birth Place Debate: ఆంజనేయ స్వామి జన్మస్థలం వివాదంపై టీటీడీ, హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మధ్య పంచాయతీ తేలలేదు. తిరుపతి విద్యాపీఠంలో గురువారం ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చ అసంపూర్తిగా ముగిసింది. ఇటీవల శ్రీరామనవమి నాడు ఆంజనేయుడు జన్మస్థలం తిరుమలలోని ఆంజనేయాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. దీనిపై హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ టీటీడీ వాదనలను ఖండించింది. హనుమంతుడు కిష్కిందలోనే జన్మించారని గోవిందానంద స్వామిజీ వాదించారు.

Govindacharya on Hanuman Birth Place Debate
Govindacharya on Hanuman Birth Place Debate

టీటీడీ సాంస్కృతిక విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ, టీటీడీ ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి చర్చలో పాల్గొన్నారు. టీటీడీ ఆధారాల్లో తప్పులు ఉన్నాయని గోవిందనంద స్వామి పేర్కొంటూ టీటీడీ పూర్తి నివేదిక అందజేస్తే తప్పులు చూపిస్తామని పేర్కొన్నారు. అయితే నివేదిక ఇవ్వడానికి టీటీడీ నిరాకరించింది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

Read More: Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం వివాదంపై  పండితుల మధ్య పంచాయతీ..!!

అనంతరం గోవిందానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు.  హనుమంతుడి జన్మస్థానం విషయంలో టీటీడీ చెప్పిన విషయాల్లో ప్రామాణికం లేదని ఆయన అన్నారు. హనుమంతుడి జన్మస్థానం విషయంపై పురాణాలు ప్రామాణికం కాదని, రామాయణాన్నే ప్రాణామికంగా తీసుకోవాలన్నారు. రామాయణం ప్రకారం కిష్కింధనే మారుతి జన్మస్థలమని పేర్కొన్నారు. ధార్మిక విషయాలపై శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతులు, మధ్వాచార్యులు, తిరుమల పెద జీయర్, చిన జీయర్ సమక్షంలో చర్చించాలన్నారు. సామాన్యులను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. టీటీడీ నిర్ణయంపై తాము జీయర్ స్వాముల వద్దకు వెళతామని గోవిందానంద తెలిపారు.


Share

Related posts

కెన్యాలో ఉగ్రవాదుల దాడి – ఆరుగురు మృతి

somaraju sharma

పీవీ సింధుకు అభినందన

sarath

మోడీ ఇచ్చినా జగన్ తీసుకుంటారా ?

Yandamuri