ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Gudivada: గుడివాడ క్యాసినో కేసులో దిమ్మతిరగే ట్విస్ట్ – కొడాలి నాని మామూలోడు కాదు బాబోయ్..!

Share

Gudivada casino: ఏపిలో మంత్రులు రెండు డజన్ల మందికి పైగా ఉన్నా మంత్రి కొడాలి నాని
వ్యవహార శైలి, దూకుడు స్వభావం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ప్రాచుర్యం పొందారు. తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడటంలో గానీ, ఆ పార్టీ అధినేత
చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేయడంలో గానీ ఆయనకు వైసీపీలో ఎవరూ సాటి లేరు. చాలా కాలంగా కొడాలి నాని వ్యవహరిస్తున్న తీరు టీడీపీ నేతలకు రుచించడం లేదు. చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలకు నాని ధోరణి, మాట తీరు రుచించడం లేదు. కానీ నానిని ఎదుర్కోవడం టీడీపీ వల్ల కావడం లేదు. గుడివాడ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా స్ట్రాంగ్ పునాదులు వేసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆయనపై దూకుడు వ్యవహరించడానికి ముందుకు రాని పరిస్థితి. చంద్రబాబుపై కొడాలి నాని చేసే పరుష వ్యాఖ్యలకు టీడీపీ నుండి ఆ స్థాయిలో
కౌంటర్ ఇచ్చే నేతలే కరువైయ్యారు. ఈ సమయం లోనే ఇటీవల గుడివాడలో సంక్రాంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమాలపై వివాదంసృష్టించే ప్రయత్నం టీడీపీ నేతలు చేశారన్న వైసీపీ ఆరోపిస్తోంది.
Gudivada casino big twist kodali nani
Gudivada casino big twist kodali nani

కరోనాతో హైదరాబాద్ లో ఉండగా..

వాస్తవానికి కొడాలి నాని జనవరి మొదటి వారంలోనే కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ కారణంగా సంక్రాంతి పండుగకు కూడా ఆయన ఇంటికి రాలేదు. ఏటా సంక్రాంతి వేడుకల సమయంలో గుడివాడలో పెద్ద ఎత్తున ఎడ్ల పందాలను నిర్వహిస్తూ గ్రామీణ సంప్రదాయ క్రీడకు పెద్ద పీట వేస్తుంటారు కొడాలి నాని. సీఎం వైఎస్ జగన్ గతంలో గుడివాడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. రెండు మూడు రోజుల పాటు గుడివాడలో జరిగే ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆనందించే వాళ్లు. కానీ ఈ సారి కరోనా కారణంగా నాని హైదరాబాద్ లో ఉండిపోవడం
వల్ల అలాంటి వేడుకలు ఏర్పాటుకు ఆస్కారం లేకుండా పోయింది.

Gudivada: క్యాసినో ఆరోపణలపై విచారణ

ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు జోరుగానే సాగాయి. ఆ సందర్భంగానే వివిధ రకాల
జూదాలు అన్ని చోట్ల సాగాయి. గుడివాడలో కొడాలి నాని అనుచరులు కూడా కొందరు కోడి పందాలు, ఇతర జూదాలు నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు మహిళలతో నృత్యాలకు ఏర్పాట్లు చేశారుట. ఈ విషయం హైదరాబాద్ లో ఉన్న మంత్రి కొడాలి నాని దృష్టికి రావడంతో ఆయన గుడివాడ డీఎస్పీకి ఫోన్ చేసి వాటిని నిలిపివేయించారుట. అయితే గుడివాడలో గోవా తరహాలో క్యాసినో నిర్వహించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక కొడాలి నాని దొరికాడు అనుకుని టీడీపీ నేతలు దాన్ని అస్త్రంగా మార్చుకుని విమర్శలు స్టార్ట్ చేశారు. కొడాలి నానిని మంత్రి పదవి నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో అసలు గుడివాడలో క్యాసినో జరిగిందా.. జరగలేదా అనేది
తేల్చేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

ఫేక్ ఫోటోలతో ఆరోపణలు

మరో పక్క నిజ నిర్దారణ కమిటీ అంటూ టీడీపీ నేతలు గుడివాడలోని కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ వద్దకు బయలుదేరి భంగపాటుకు గురైయ్యారు. విజయవాడ టీడీపీ నేతలు గుడివాడ రావడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేయడంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేసి వెనక్కు పంపించి వేశారు. ఇక కరోనా నుండి పూర్తిగా కోలుకుని నిన్న
కేబినెట్ మీటింగ్ కు హజరైన కొడాలి నాని ఈ వ్యవహారంపై స్పందించారు. విమర్శకులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. గుడివాడలో క్యాసినో
నిర్వహించినట్లు టీడీపీ వాళ్లు నిరూపిస్తే అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. ఎక్కడివో ఫోటోలు, వీడియోలు తీసుకువచ్చి గుడివాడలో జరిగినట్లు తప్పుడు కథనాలు సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మంత్రి కొడాలి నాని ఈ విధంగా
రియాక్షన్ ఇవ్వడంతో కొడాలి నాని మమూలోడు కాదు బాబోయ్ అంటున్నారు.

Share

Related posts

ఏపి ప్రభుత్వానికి మరో షాక్..పంచాయతీ పోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

somaraju sharma

పోలీసుల పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..!!

sekhar

కేజీఎఫ్ 2 టీజర్ తో ప్రపంచంలోనే ఎవ్వరు సంపాదించలేని రికార్డు సాధించిన రాకింగ్ స్టార్ యాష్

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar