ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gudivada Casino: ఆగని గుడివాడ క్యాసినో వివాదం..కొత్త పాయింట్ వెల్లడించిన వర్ల రామయ్య..

Share

Gudivada Casino: గుడివాడలో క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని, తరువాత చంద్రబాబే వచ్చి నిరూపించాలని అన్నారు. గుడివాడలో సంక్రాంతి వేడుకల సందర్భంగా కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో తో పాటు పేకాట లాంటి జూదాలతో పాటు చీర్ గర్ల్స్ తో అసభ్య నృత్యాలు నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకు సంబంధించిన పలు వీడియోలను,. ఫోటోలను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Gudivada Casino issue varla ramaiah
Gudivada Casino issue varla ramaiah

 

Gudivada Casino: ఇరువర్గాలపై కేసులు నమోదు

దీనిపై మంత్రి కొడాలి నాని ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియాతో అసత్య ఆరోపణలు చేస్తుందంటూ దుయ్యబట్టారు. టీడీపీ తరపున గుడివాడ వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు అరెస్టు చేసి వెనక్కు పంపించారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి వ్యతిరేకంగా కొడాలి నాని అనుచరులు పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించడం, ఇరువర్గాలు పోటాపోటీ నినాదాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం, టీడీపీ నేత బొండా ఉమా కారుపై రాళ్ల దాడి జరగడం తెలిసిందే. టీడీపీ నేతల ఫిర్యాదుపై వైసీపీ కార్యకర్తలపై, మరో పక్క టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

 

Gudivada Casino: 13 మంది చీర్ గర్ల్స్ ఇండిగో విమానంలో

ఇప్పటికే కృష్ణాజిల్లా ఎస్పీకి. డీఐజీలకు గుడివాడలో క్యాసినో పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వర్ల రామయ్య క్యాసినో చీర్ గర్ల్స్ ప్రయాణ వివరాలను మీడియాకు వెల్లడించారు. క్యాసినో నిర్వహణకు సంబంధించి సాక్షాధారాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మొత్తం 13 మంది చీర్ గర్ల్స్ ఇండిగో విమానంలో ప్రయాణం చేశారని వెల్లడించారు.

Gudivada Casino: ఉత్తరాది మహిళలు గుడివాడకు ఎందుకు..?

గన్నవరం – బెంగళూరు. బెంగళూరు – గోవా, గోవా – విజయవాడ ప్రయాణీకుల వివరాలను మీడియా ముందు వెల్లడించిన వర్ల రామయ్య..గోవా నుండి విజయవాడ వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు గుడివాడకు ఎందుకు వచ్చారని వర్ల రామయ్య ప్రశ్నించారు. మరో పక్క క్యాసినో పాల్గొనే వారి నుండి రూ.50వేల వరకూ వసూలు చేశారనీ, ఆ ప్యాకేజీలో భాగంగా లాడ్జి వసతి, ట్రాన్స్ పోర్టు, ఎంట్రీ ఫీజు అన్ని ఉచితమని వర్ల రామయ్య వివరించారు.


Share

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు … మీ ప‌రువు ఎక్క‌డ పోతోందో తెలిస్తే షాక్ అవుతారు!

sridhar

Traditional: తెలుగువారి సాంప్రదాయ 345 రుచుల  గురించి  తెలుసుకుంటే  ఈ లిస్ట్ తప్పకుండా దాచుకుంటారు  !!(పార్ట్ -2)

siddhu

Shruti Haasan: ఆ రకమైన యాప్స్ పైన విరుచుకుపడిన హీరోయిన్ శృతిహాసన్!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar