Gudivada Politics: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తరచుగా టీడీపీని, చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గానే విమర్శలు చేస్తుంటారు తప్ప నందమూరి ఫ్యామిలీ జోలికి వెళ్లలేదు. వెళ్లేవారు కాదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో ఎవరినీ ఇటీవల కాలం వరకూ విమర్శించిన దాఖలాలు లేవు. అయితే కొడాలి నాని మొదటి సారిగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్ చేశారు. ఇటువైపు పురందేశ్వరి నేరుగా ఎవరిపైనా ఘాటుగా విమర్శలు చేయరు. అప్పుడప్పుడు జగన్మోహనరెడ్డి పరిపాలన మీద, వైసీపీ మీద విమర్శలు చేస్తుంటారు తప్ప హద్దులు మీరి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆమెకు గుడివాడ రాజకీయాలకు సంబంధమే లేదు. కృష్ణాజిల్లా లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎన్టీఆర్ పుట్టిన ఊరు అయిన పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామం అప్పుడప్పుడు వెళ్తుంటారు గానీ గుడివాడ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ వేలు పెట్టిన దాఖలాలు లేవు.
కానీ కొడాలి నాని రీసెంట్ గా ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. గుడివాడలో తీవ్ర సమస్యగా ఉన్న రైల్వే ట్రాక్ ల వద్ద వంతెనల నిర్మాణానికి తాము కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించుకోగా, బీజేపీ జాతీయ నాయకురాలి హోదాలో ఉన్న పురందేశ్వరి ఆ నిధులు రాకుండా అడ్డుపడుతున్నారనీ, గుడివాడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణ చేశారు కొడాలి నాని. అయితే కొడాలి నాని చేసిన ఆరోపణలకు బీజేపీ నుండి కౌంటర్ ఇవ్వరూ ఇవ్వలేదు. కొడాలి నాని తన మాటల్లో పురందేశ్వరిని టార్గెట్ చేశారే గానీ బీజేపీని విమర్శించలేదు. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించలేదు. పురందేశ్వరి బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమెకు జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. ఎన్టీఆర్ కుమార్తెగా, మాజీ కేంద్ర మంత్రిగా కేంద్ర పెద్ద అపాయింట్మెంట్ లు కావాలంటే ఆమెకు ఈజీగానే లభిస్తుంటాయి. ఆమె తన పరపతిని ఉపయోగంచుకుని పర్చూరు, చీరాల ప్రాంతాల్లో తన అనుచరులకు కావాల్సిన చిన్న చిన్న పనులు అయితే చేయిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్లు మంజూరు చేయించుకున్న పనులను ఆపారు అని అమెపై ఇంత వరకూ విమర్శలు రాలేదు. మొదటి సారే కొడాలి నానే ఇటువంటి ఆరోపణ ఆమెపై చేస్తున్నారు.
అయితే కొడాలి నాని ఈ విమర్శ చేయడంలో రాజకీయ కోణం ఉందనీ, కావాలనే ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారనే మాటలు వినబడుతున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న కారణంగా వాటిని మనసులో పెట్టుకుని పురందేశ్వరి కేంద్రంలో తనకు ఉన్న పరపతి ఉపయోగించి ఇలా చేసి ఉన్నారేమో అని అనుకుంటున్నారు. దీనిపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తే వాస్తవ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొడాలి నాని మాత్రం చాలా సీరియస్ కామెంట్స్ చేయడంతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. పురందేశ్వరి టార్గెట్ గా కొడాలి నాని విమర్శలు చేయడంతో ఆమె గుడివాడ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారా..? గుడివాడ నుండి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారా..? అన్న కొత్త పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…