Gudlavalleru (NTR) : మండల కేంద్రమైన గుడ్లవల్లేరులోని ఏఏఎన్ అండ్ వివిఆర్ ఎస్ఆర్ హైస్కూల్ నందు బుదవారం సామాజిక తనిఖీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మండల విద్యా శాఖ అధికారి (ఎంఇఓ) సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంఇఓ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తల్లిదండ్రుల సమావేశాల తదితర అంశాల గురించి వివరించారు. విద్యార్ధులకు చేసే బోధన వల్ల మెరుగైన ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు అనంతరం రిసోర్స్ పర్సన్ వివి రాజశేఖర్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు వివిధ అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీఎం జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం