NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: బుగ్గన, పేర్ని దారిలో మరో నేత .. సీఎం జగన్ ఏమంటారో..?

YSRCP: వైసీపీలో పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో వారి వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ వారి వారసులే చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి లు తమ మనసులోని మాటను ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ కుమారులు పోటీ చేస్తారని చెప్పగా, అందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అంగీకరించలేదని తెలిసింది. రాబోయే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని బుగ్గన, పేర్ని లకు జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా మరి కొందరు నేతలు కూడా తమ వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని భావిస్తున్నా పేర్ని, బుగ్గన ప్రతిపాదనలను జగన్ తిరస్కరించడంతో తమ మనసులోని మాటను సీఎం దృష్టికి తీసుకురాలేదు.

YSRCP CM YS Jagan

 

అయితే తాజాగా గుంటూరు తూర్పు వైేసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా బహిరంగంగా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి విజయం సాధించిన ముస్తాఫా కూడా తను రాజకీయాల నుండి తప్పుకుని కుమార్తె ఫాతిమాను ఎన్నికల బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, తన బదులుగా తన కుమార్తె ఫాతిమా పోటీ చేయనున్నదని చెప్పారు ముస్తాఫా, ఫాతిమాకు పార్టీ హైకమాండ్ మద్దతు ఉందని, జగన్ ఆశీస్సులతోనే ఫాతిమా పోటీ చేస్తుందని ముస్తాఫా తెలిపారు.

ముస్తాఫా ప్రతిపాదనను సీఎం జగన్ అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పార్టీ లో చర్చనీయాంశం అవుతోంది. ముస్తాఫా కుమార్తె కు టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరిస్తే మరి కొందరు కూడా తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఇప్పటికే బుగ్గన, పేర్ని లు చేసిన ప్రతిపాదనకు నో చెప్పిన సీఎం జగన్ .. ముస్తాఫా విషయంలో ఇతర నాయకుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ధఫా నిర్వహించే గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో నేతల వారసుల రాజకీయ రంగ ప్రవేశంపై జగన్ మరో సారి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

MLA Mustafa

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!