NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CRDA: సీఆర్‌డీఏకి లీగల్ నోటీసు ఇచ్చిన హ్యాపీనెస్ట్ ప్లాట్ల కొనుగోలుదారులు..మేటర్ ఏమిటంటే..?

CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది కస్టమర్ లు లీగల్ నోటీసులు పంపించారు. 2021 నాటికి ప్లాట్లు అందజేయాలన్న నిబంధన ఉన్నా గడువు తీరినా ప్లాట్లు అప్పగించకపోవడంతో తాము చెల్లించిన పది శాతం సొమ్మును 14 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే రూ.20లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే సీఆర్డీఏపై రేరా చట్టం కింద కేసు వేస్తామని కొనుగోలు దారులు పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ద్వారా సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపారు.

Happy nest buyers issues legal notices to AP CRDA
Happy nest buyers issues legal notices to AP CRDA

Read More:AP High Court: ఏపి సర్కార్‌పై కీలక కామెంట్స్ చేసిన హైకోర్టు..

AP CRDA: ఒప్పంద గడువు ముగిసిపోవడంతో..

అమరావతి రాజధాని పరిధిలో 2018లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా అత్యాధునిక హంగులతో హ్యాపీనెస్ట్ నివాస సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్మించే 12 టవర్లలో 1200 ప్లాట్ లు కడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో హ్యాపీనెస్ట్ ప్లాట్లు అన్నీ గంట వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. సీఆర్డీఏ ఒప్పందం మేరకు తొలి వాయిదాగా కొనుగోలుదారులు పది శాతం సొమ్ము చెల్లించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ పల్లోంజీ టెండర్లకు ముందుకు వచ్చింది. డిసెంబర్ 31, 2021 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో హ్యాపీనెస్ట్ నిర్మాణం నిలిచిపోయింది. గత ఏడాది రీ టెండర్ల పేరుతో హడావుడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు. ఒప్పంద గడువు ముగిశాక నెలన్నరకుపైగా వేచి చూసిన కొనుగోలుదారులు సీఆర్డీఏకు లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులపై సీఆర్డీఏ, జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju