NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీకి దొరికిపోయిన జ‌గ‌న్‌…. ఇప్పుడు కొత్త గేమ్ ?

YS Jagan: Can Control Central upto 2024

BJP : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్త‌గా టార్గెట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సీఎం జ‌గ‌న్ ను ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోందా? స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కదులుతున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేయ‌డం , అదే స‌మ‌యంలో ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.

AP Politics : Secret game by BJP
BJP : ఢిల్లీలో మారుతున్న సీన్‌

ఏపీలో ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఢిల్లీలో కీల‌క మార్పులు జ‌రిగాయి. రాజ్యసభలో విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన ధర్మేంద్ర ప్రధాన్.. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్‌ ఆసక్తి కనబరిచిందని రాజ్యసభ ప్రకటించారు. పోస్కో – ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య 2019 అక్టోబర్‌లో న్యాయపరంగా కట్టుబాట్లు లేని అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరినట్లు చెప్పారు.

దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పడిందన్న ఆయన.. ఈ దశలో ఎవరి వాటా ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఎంవోయూ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్‌ ప్లాంట్‌లో 50 శాతం తమకు ఉండాలని పోస్కో స్పష్టం చేసిందన్నారు. సాయిరెడ్డి ప్రశ్నకు సభలో రాతపూర్వకంగా జవాబిచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఈ మేర‌కు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.

జ‌గ‌న్ ప‌రిష్కారం చూపినప్ప‌టికీ….

ఏపీలో ఆందోళ‌న‌లు, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకున్న సీఎం జ‌గ‌న్ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రధానికి లేఖ రాశారు.
వైజాగ్ స్టీల్స్ పునరుద్దరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో సీఎం జగన్‌.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ కు సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటి పరిష్కార మార్గాలు చూపించారు. అయితే కేంద్రం ఇప్పటికే విధానప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నందున, అదే స‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రిగిన చ‌ర్చ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఏపీ సీఎం టార్గెట్ గా గేమ్ జరుగుతోందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju