NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతోంది. అయితే… మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్రంగా ఉన్న అసంతృప్తి కారణంగా… పేరు తెలియని కాంగ్రెస్ నేతలందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ విజయం సాధించారు.

అలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒకరు. రాజకీయాల్లో ఉద్దండుడు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి బడా లీడర్ను మట్టికరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఎవరు ఊహించని రీతిలో… అనుప్యంగా యశస్విని తెరపైకి వచ్చారు. తన అత్తమ్మ ఝాన్సీ రెడ్డి కి ఇండియా పౌరసత్వం లేదా పోవడంతో యశస్విని రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు పై 47 వేల పైచిలుకు మెజారిటీతో… 26 ఏళ్ల యశస్విని రెడ్డి విజయం సాధించారు.

10 సంవత్సరాల గులాబీ పార్టీ పాలన చూసి విసిగిపోయిన పాలకుర్తి ప్రజలు.. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దారు. దీంతో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యశస్విని రెడ్డి విజయం సాధించారు. రాజకీయాల్లో కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేని ఈమె అవలీలగా విజయం సాధించారు. అయితే యశస్విని రెడ్డి విజయానికి ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు. అందులో మహిళలకు 2500 ఇస్తామనడం అందరినీ ఆకర్షించడం జరిగింది.

దీంతో యశస్విని రెడ్డిని దగ్గరుండి గెలిపించారు పాలకుర్తి మహిళా ఓటర్లు. అయితే ఆమె గెలిచి… మూడు నెలలు కాలేదు కానీ యశస్వి రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సొంత కాంగ్రెస్ క్యాడరే… యశస్విని రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో యశస్విని రెడ్డి అత్త ఆధిపత్యం ఎక్కువైందని… కోడలు అధికారాన్ని మొత్తం ఆమె అత్తమ్మ కొనసాగిస్తుందని కాంగ్రెస్ క్యాడర్ అలాగే ప్రజలు మండిపడుతున్నారు.

కాంగ్రెస్ క్యాడర్ను పట్టించుకోకుండా గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలకు ఎక్కువగా యశస్విని రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు కూడా యశస్విని రెడ్డి పై మండిపడుతున్నారు. మహిళలకు 2500 నేలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని… ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా తమ నిరసనను తెలుపుతున్నారు. దీంతో యశస్విని రెడ్డికి ఎమ్మెల్యే అయిన సుఖం లేకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు. ఇకనైనా తన అత్త ఝాన్సీ రెడ్డి మాటలు వినకుండా.. క్యాడర్ను అలాగే మహిళలను పట్టించుకుంటే యశస్విని రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N