NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

ఏపీలో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. దాదాపు అన్ని పార్టీల్లోనూ సీట్ల స‌ర్దు బాటు పూర్తికావ‌డం(కొన్ని త‌ప్ప‌)తో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అన్ని పార్టీల నాయ‌కులు.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. వీరితోపాటు.. ఇప్పుడు కుటుంబ స‌భ్యులు కూడా బ‌రిలోకి దిగారు. పార్టీల త‌ర‌ఫున వారు కూడా ప్ర‌చారం చేస్తున్నారు. రాయ‌ల‌సీమ నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు నాయ‌కుల కుటుంబాలు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. అన‌ప‌ర్తి టికెట్‌ను ద‌క్కించుకున్న టీడీపీ నాయ‌కుడు ఆరిమిల్లి రాధాకృష్ణ స‌తీమ‌ణి కృష్ణ తుల‌సి.. ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నారు.

విజ‌య‌వాడ‌లో సెంట్ర‌ల్‌నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న టీడీపీనాయ‌కుడు బోండా ఉమా మ‌హేశ్వ‌ర రావు కుటుంబం మొత్తం బ‌రిలో ఉంది. ఆయ‌న స‌తీమ‌ణి, ఇద్ద‌రు కుమారులు కూడా.. ప్ర‌చారం చేస్తున్నా రు. ఇక‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు.. స‌తీమ‌ణి, సోద‌రులు, కుమార్తె కూడా.. ప్ర‌చారంలో ఉన్నారు. ఇక‌, ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో బాలినేని శ్రీనివాస‌రెడ్డి (వైసీపీ) త‌ర‌ఫున ఆయ‌న కోడ‌లు, కుమారులు, స‌తీమ‌ణి కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక్క‌డ వివాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇక‌, శ్రీకాకుళంలోని ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌తీమ‌ణి, కుమారుడు చిరంజీవి కూడా ప్ర‌చారం చేస్తున్నారు. నారా లోకేష్ కోసం.. ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి.. సోమ‌వారం నుంచి ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నిజంగెల‌వాలి యాత్ర‌లో ఉన్న నారా భువ‌నేశ్వ‌రి.. కూడా సోమ‌వారం నుంచి కుప్పంలో ప‌ర్య‌టించి.. ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా అక్క‌డే ప్ర‌చారం చేయ‌నున్నారు.

ఇదేవిధంగా సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి.. వైఎస్ భారతి కూడా.. ప్ర‌చారానికి రెడీ అవుతున్నారు. ఆమె పులివెం దుల స‌హా కడ‌ప‌లో వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని నాని కుటుంబం నుంచి ఆయ‌న కుమార్తె శ్వేత‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న గ‌ద్దె రామ్మోహ‌న్‌(టీడీపీ) స‌త‌మణి కూడా ఇప్పటికే ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. జేసీ కుటుంబంలో దివాక‌ర్‌రెడ్డి మిన‌హా.. మిగిలిన వారంత‌కూడా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఇలా.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంలో కుటుంబాల‌కు కుటుంబాలే ప్ర‌చారానికి క‌ద‌ల‌డం గ‌మ‌నార్హం.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?